Shocking Video : నదిలో చేపలకు గాలం వేశాడు.. భారీ చేప అతన్ని ఈడ్చుకెళ్లింది!
అతడికి చిన్నప్పటి నుంచి చేపలు పట్టడమంటే చాలా ఇష్టం.. ఎప్పటిలానే ఆ రోజూ కూడా చేపలు వేటాడేందుకు వెళ్లాడు. ఆ రోజు మంచి రోజు అనుకుంట.. గాలం వేశాడో లేదో అతడికి పెద్ద చేప పడింది.

Watch Fisherman Gets Pulled Into A Lake By Huge Fish
Fisherman Gets Pulled Into A Lake By Huge Fish : అతడికి చిన్నప్పటి నుంచి చేపలు పట్టడమంటే చాలా ఇష్టం.. ఎప్పటిలానే ఆ రోజూ కూడా చేపలు వేటాడేందుకు వెళ్లాడు. ఆ రోజు మంచి రోజు అనుకుంట.. గాలం వేశాడో లేదో అతడికి పెద్ద చేప పడింది. కానీ, ఆ చేప అతడ్ని బురద నీటిలో ఈడ్చుకెళ్లింది. ఫిషింగ్ రాడ్ తో సహా అతడు బురదలోకి పడిపోయాడు.
అదృష్టవశాత్తూ అతడికి ఏం కాలేదు. ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సోమోగీ కౌంటీలో జరిగింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయగా.. ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. గత జూన్‌లో హర్సాస్‌బర్కి సరస్సు వద్ద చేపల వేటకు వెళ్లిన లోరెంట్ స్జాబో అనే వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. ఇంతకీ ఎరకు తగిలిన భారీ చేప బరువు దాదాపు 66 కిలోలు ఉంటుందట.
చేప దొరికేవరకు ఎదురుచూశాడు. షిషింగ్ రాడ్ కదిలింది. అమ్మయ్యా చేప పడిందిలే అనుకున్నాడు. రాడ్ తో చేపను బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. కానీ, అది అతన్ని నీటిలోకి లాగేసి అక్కడి నుంచి జారుకుంది. కొంతసేపు అతడికి ఏమైందా అని చూస్తే.. కొంతసేపటికి బురదతో నిండిన బట్టలతో సరస్సులో నుంచి బయటకు రావడం వీడియోలో కనిపించింది.
Alligator : డ్రోన్ తినేసిన మొసలి.. నోట్లో నుంచి పొగలు.. వీడియో షేర్ చేసిన గూగుల్ సీఈఓ