Two Month old Baby singing : పాట పాడిన రెండు నెలల పసిబిడ్డ..! వావ్ అంటున్న నెటిజన్లు

పాట పాడిన రెండు నెలల పసిబిడ్డ..! పాలు తాగి హాయిగా బజ్జునే వయస్సులో ఈ చిచ్చరపిడుగు పాటకు వావ్ అంటున్నారు నెటిజన్లు.

Two Month old Baby singing : పాట పాడిన రెండు నెలల పసిబిడ్డ..! వావ్ అంటున్న నెటిజన్లు

Updated On : November 29, 2022 / 12:02 PM IST

Two Month old Baby singing : రెండు నెలల పసిబిడ్డ..ఆకలేస్తే ఏడవటం కూడా సరిగా రాని వయస్సు. సాధారణంగా ఆ వయస్సులో శిశువులు అలాగే ఉంటారు. బొజ్జనిండా పాలు తాగి హాయిగా నిద్రపోతుంటారు. కానీ ఓ రెండు నెలల చిన్నారి మాత్రం ఏకంగా పాటలే పాడేస్తోంది..! వినటానికి ఇది విడ్డూరంగా ఉన్నా నిజ్జంగా నిజం. ఓ రెండునెలల పసిబిడ్డ తన తాత పాట పాడుతుంటే కోరస్ గా తాను కూడా గొంతు కలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో తాత లాలి పాట పాడుతుంటే… దానిని అనుకరించడానికి ఆ చిన్నారి తాత వంక తదేకంగా చూస్తూ తాను కూడా శృతి కలిపటం నిజంగా విడ్డూరంగానే ఉంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వార్నీ ఇదేనేమో కంప్యూటర్ కాలంలో పిల్లలంటే అనిపించేలా ఉంది.

ఈ వీడియోలో..తాత శిశువును తన చేతుల్లో పట్టుకొని పాట పాడుతుండగా.. చిన్నారి కూడా తాతయ్యను అనుకరించే ప్రయత్నం చేసింది.. అతనితో కలిసి తన చిట్టి గొంతుతో శృతి కలపినట్లుగా ఉంది. వాళ్ల తాత వైపు చూస్తూ… ఆసక్తిగా అనుకరించడం విశేషం. తాత గొంతు అద్భుతంగా ఉంది. ఆచిన్నారి ప్రయత్నం నిజ్జంగా సూపర్బ్ గా ఉందంటున్నారు నెటిజన్లు.