Shehbaz Sharif : మేము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోం.. కానీ చట్టం తనపని తాను చేసుకుపోతుంది

ఈ రోజు సంతోషకరమైన రోజని పాకిస్తాన్ లీగ్ నవాజ్ (PML-N) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేము ప్రజల ఇబ్బందులను తొలగించి, వారికి మంచి పాలన అందించాలని...

Shehbaz Sharif

Shehbaz Sharif :  పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో శనివారం రాజకీయ హైడ్రామా కొనసాగింది. ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంకు ఓటింగ్ నిర్వహించేందుకు జాతీయ అసెంబ్లీ శనివారం ఉదయం ప్రారంభమై అర్థరాత్రి వరకు కొనసాగింది. అనేక రాజకీయ హై డ్రామాలు, అధికార, ప్రతిపక్ష నేతల వాదోపవాదాల నడుమ ఎట్టకేలకు అర్థరాత్రి దాటిన తరువాత అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో 342 మంది సభ్యులున్న సభలో 174 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస ఓటింగ్ లో ఓడిపోయిన తరువాత పాకిస్తాన్ కు తదుపరి ప్రధానమంత్రి కాబోతున్న పాకిస్తాన్ లీగ్ నవాజ్ (PML-N) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Pak politics : ఇమ్రాన్ ఖాన్ ఔట్.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన విపక్షాలు.. అర్థరాత్రి వరకు కొనసాగిన రాజకీయ హైడ్రామా

ఈ రోజు సంతోషకరమైన రోజని అన్నారు. మేము ప్రజల ఇబ్బందులను తొలగించి, వారికి మంచి పాలన అందించాలని అనుకుంటున్నామని అన్నారు. మేము ప్రతీకారం తీర్చుకోమని, ఎవరికీ అన్యాయం చేయమని, అమాయకులను జైల్లో పెట్టబోమని స్పష్టం చేశారు. కానీ.. చట్టం తనపని తాను చేసుకొని పోతుందని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ మెజార్టీ కోల్పోవడంతో నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తుంది.

Pakistan Political Crisis : నేడు తేలనున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం

పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చీఫ్ గా ఉన్న షెహబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. సమర్థవంతమైన పరిపాలనాదక్షుడిగా పేరు పొందారు. పంజాబ్ ప్రావిన్స్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న షెహబాజ్ షరీఫ్ ఇమ్రాన్ ప్రభుత్వంపై పలు అంశాలపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.