Liz Truss On victory: బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ ముందు అనేక సవాళ్ళు.. గెలిచాక ఆమె ఏం చెప్పారంటే..

‘‘ట్యాక్సులు తగ్గించడానికి, మన ఆర్థిక వ్యవస్థ బలపడడానికి, విద్యుత్తు సంక్షోభం, విద్యుత్తు సరఫరాపై దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, జాతీయ ఆరోగ్య సేవలపై ఓ భారీ ప్రణాళికను వేసుకుంటాం. అలాగే, 2024లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించేలా చేస్తాం’’ అని లిజ్ ట్రస్ అన్నారు. దీంతో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోమని ఆమె సంకేతాలు ఇచ్చారని నిపుణులు చెబుతున్నారు.

Liz Truss On victory: బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ ముందు అనేక సవాళ్ళు.. గెలిచాక ఆమె ఏం చెప్పారంటే..

Liz Truss On victory

Updated On : September 5, 2022 / 7:42 PM IST

Liz Truss On victory: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి హోదాకు పోటీ చేసి గెలిచినప్పటికీ లిజ్‌ ట్రస్ ముందు సమీప భవిష్యత్తులో అనేక సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, జీవన వ్యయం(కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌)ను నియంత్రించాల్సి ఉంటుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దిగజారుతోంది. మొన్నటి వరకు ప్ర‌పంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న బ్రిటన్ ఇప్పుడు ఆరో స్థానానికి దిగజారిపోయింది. భారత్ 5వ స్థానానికి ఎగబాకింది.

బ్రిటన్ లోని ద్రవ్యోల్బణం కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నికను ప్రభావితం చేసిందనే చెప్పుకోవాలి. దీనిపైనే లిజ్ ట్రస్, భారత సంతతి నేత రిషి సునక్ ఎన్నికల ప్రచారంలో పలు హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలను నేడు ప్రకటించడంతో లిజ్ ట్రస్ దీనిపై మాట్లాడారు. అలాగే, 2024లో జరిగే బ్రిటన్ ఎన్నికల్లో తమ కన్జర్వేటివ్ పార్టీని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు.

‘‘ట్యాక్సులు తగ్గించడానికి, మన ఆర్థిక వ్యవస్థ బలపడడానికి, విద్యుత్తు సంక్షోభం, విద్యుత్తు సరఫరాపై దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, జాతీయ ఆరోగ్య సేవలపై ఓ భారీ ప్రణాళికను వేసుకుంటాం. అలాగే, 2024లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించేలా చేస్తాం’’ అని లిజ్ ట్రస్ అన్నారు. దీంతో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోమని ఆమె సంకేతాలు ఇచ్చారని నిపుణులు చెబుతున్నారు.

China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్