పుట్టిన బిడ్డను ముట్టుకోవడానికి 20 రోజుల పాటు వెయిట్ చేసిన తల్లి

శిశువును ముట్టుకోవడానికి ఓ తల్లి 20 రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థతి ఏర్పడింది. జన్మనిచ్చిన తర్వాత..తన పసికందు ఎలా ఉందో..ముట్టుకోవడానికి కూడా ఇన్ని రోజులు వేచి ఉండడం భరించరానిదని తల్లి Figueroa వెల్లడించారు.
Figueroa మహిళ గర్భవతి అయ్యింది. కానీ పరీక్షలు చేయగా..కరోనా సోకిందని తేలింది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. టెక్సాస్ లోని డల్లాస్ పార్క్ లాండ్ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. Parkland’s senior vice president of nursing ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు.
శిశువు జన్మించిన ఒక్క రోజులోనే కరోనా వైరస లక్షణాలు కనిపించాయని, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందులున్నాయని వైద్యులు గ్రహించారు. దీంతో తల్లి నుంచి శిశువును వేరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో తల్లి Figueroa తల్లడిల్లిపోయింది. దీంతో వైద్యులు iPad ద్వారా శిశువుకు జరుగుతున్న చికిత్సను లైవ్ ద్వారా చూపించారు. ఇదంతా..అందరనీ కంటతడిపెట్టిస్తుందని తెలిపారు.
ఏ తల్లికైనా బాధగానే ఉంటుందని వైద్యులు తెలిపారు. Figueroa ఇప్పటి వరకే ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతా మేలు జరుగుతుందని, కష్టంగానే ఉన్న..భరించకతప్పదన్నారు.