Deported Indians : కాళ్లు, చేతులకు సంకెళ్లతోనే టాయిలెట్ వెళ్లాం.. అలానే తిన్నాం.. 51 గంటలు నరకయాతన.. కైతాల్ యువకుడి కన్నీటి వ్యథ..!

Deported Indians : అమెరికా వెనక్కి పంపిన హర్యానాలోని కైథల్‌కు చెందిన ఐదుగురు యువకులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తమకు ఎదురైన భయానక పరిస్థితిని వివరిస్తూ బోరున విలపిస్తున్నారు.

Deported Indians

Deported Indians : ట్రంప్ చేసిన పనికి అక్రమ మార్గంలో అమెరికా వెళ్లిన భారతీయులంతా ఆగచాట్లు పడుతున్నారు. వలసదారులందరిని ట్రంప్ వెనక్కి పంపేస్తున్నారు. ఏ ఒక్కరిని వదలడం లేదు.. మా దేశానికే దొంగదారిలో వస్తారా? అన్నట్టుగా ఇంటికి సాగనంపేస్తున్నారు. ఇప్పుడు వారంతా స్వదేశానికి చేరుకుంటున్నారు.

తిరిగి వచ్చేవారంతా అమ్మో అమెరికా అనే పరిస్థితి కనిపిస్తోంది. అత్యంత దారుణంగా తమను వెనక్కి వెళ్లగొడుతున్నారని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇప్పటికే భారత్‌‌కు అమెరికా విమానంలో మొదటి బ్యాచ్ వచ్చేసింది. అనేక మంది తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. అమెరికా వలసదారుల వ్యథలు ఆద్యంతం కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయి.

Read Also : Gujarat Family : లాండ్ అమ్మి.. కోటి రూపాయలు ఖర్చు పెడితే… కన్నీళ్లు పెట్టిస్తున్న గుజరాతీ తల్లీకొడుకుల వ్యథ..!

తిరిగొచ్చిన యువకుల్లో తీవ్ర మానసిక ఒత్తిడి :
అమెరికా వెనక్కి పంపిన భారతీయుల్లో హర్యానాలోని కైతాల్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు కూడా ఉన్నారు. వీరంతా తమ గ్రామానికి తిరిగి వచ్చారు. కానీ, వీరంతా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. నేరుగా ఇంటికి వెళ్లకుండా, స్నేహితులు, బంధువులతో సమయం గడుపుతున్నారు. వీరిలో నలుగురి యువకులను పంజాబ్ పోలీసులు వారి గ్రామాలకు తరలించారు. పిల్లలను చేతులకు సంకెళ్లు వేసి ఇంటికి తీసుకువచ్చి, ఆ తర్వాత విడిచిపెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అందులో కైతల్ జిల్లాకు చెందిన ఒక యువకుడు తనకు ఎదురైన భయానక అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ బోరుమని విలపించాడు. అతడు మాత్రమే కాదు.. ఆ జిల్లాకు చెందిన అనేక మంది యువకులు ఇదే విషయాన్ని చెబుతూ తమ వ్యథను చెప్పుకుంటూ కుమిలిపోయారు.

మరో 103 మంది భారతీయులను భారత్‌కు తరలించిన అమెరికా సైనిక విమానంలో “నరకం కన్నా దారుణం”గా ఉందని యువకుడు వాపోయాడు. కైతల్‌లోని కసన్ గ్రామానికి చెందిన అంకిత్ తాను ఎంత దుర్భర స్థితిలో చేరుకున్నాడో వివరించాడు. కనీసం టాయిలెట్ వెళ్లేందుకు కూడా తనకు అనుమతి ఇవ్వలేదని వాపోయాడు.

51 గంటలు సంకెళ్లతోనే హింసించారు :
ఎంత మోరపెట్టుకున్నప్పటికీ తన చేతికి బేడీలు వేసి, కాళ్లకు సంకెళ్లు తొలగించలేదని చెప్పుకొచ్చాడు. అత్యంత దారుణంగా తమను 51 గంటల పాటు సంకెళ్లలతోనే ఉంచారని, తమ సీట్ల నుంచి ఒక్క అంగుళం కూడా కదలడానికి అనుమతించలేదని గోడు వెల్లబోసుకున్నాడు. పదే పదే వేడుకున్న తర్వాత చివరకు తమను వాష్‌రూమ్‌ వెళ్లేందుకు అనుమతించారని చెప్పాడు.

చివరికి విమానంలోని కొందరు తమను టాయిలెట్ తలుపు తెరిచి లోపలికి నెట్టేశారని తెలిపాడు. వారికి భయపడి, వలసదారులు రివర్స్ మైగ్రేషన్‌ను ఎంచుకున్నారని చెప్పిన అంకిత్.. విమానంలో కూడా తమను సరిగ్గా తినలేకుండా చేశారని వాపోయాడు. “చేతులకు బేడీలు వేసి అలానే బలవంతంగా తమతో తినిపించారని చెప్పాడు.

అమెరికా కల కోసం రూ.45 లక్షలు అప్పు తెచ్చా :
అంతేకాదు.. అమెరికా వెళ్లాలనేది తన కలని, అందుకోసం రూ. 45 లక్షలు ఖర్చు చేసిట్టు తెలిపాడు. అమెరికా వెళ్లాక చాలా కష్టాల తర్వాత అక్కడికి చేరుకునేందుకు ఏడు నెలలు పట్టిందని తన అనుభవాలను ఒక్కొక్కటి పంచుకున్నాడు ఆ యువకుడు. భారత్‌లో యువతకు ఉద్యోగాలు లేవు.. అందుకే నాలాంటి వారు అక్కడికి వెళ్తున్నారు. కానీ, ఇప్పుడు అంతా నాశనమైంది” అని అంకిత్ కన్నీంటిపర్యంతమయ్యాడు.

Read Also : దేవుడా.. అమెరికా అడ్డదారిలో వెళ్లినోళ్ల కథలు.. దారిలో చావులు, పుర్రెలు.. ఒళ్లు గగుర్పొడిచే వ్యథలు చదివితే..

అక్రమ మార్గంలో అమెరికా వెళ్లొద్దు.. యువకుడి అభ్యర్థన : 
జనవరి 24న తాను మెక్సికో సరిహద్దుకు చేరుకున్నానని అంకిత్ చెప్పుకొచ్చాడు. కానీ, అక్కడే తాను పట్టుబడ్డాడు. “మమ్మల్ని ఇతరులతో పాటు మహిళలతో సహా నిర్బంధ కేంద్రంలో ఉంచారు. మా కాళ్లకు సంకెళ్లు వేసి బంధించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 3న వారు తరలింపు ప్రక్రియను ప్రారంభించారు. 51 గంటల ప్రయాణంలో ఎలాంటి సౌకర్యం లేదు. వారు మమ్మల్ని తీవ్రంగా హింసించారు.

ఇప్పుడు నా అమెరికా కలలు చెదిరిపోయాయి. ఇతర యువత తమ కలలను నెరవేర్చుకునేందుకు ఇలా అక్రమ మార్గంలో వెళ్లొద్దని నేను కోరుతున్నాను. నేను బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు నేను వాటిని ఎలా తిరిగి చెల్లించాలో తెలియక ఆందోళన చెందుతున్నాను,” అని అంకింత్ పుట్టెడు దు:ఖంతో తన గాథను చెప్పుకొచ్చాడు.