Gujarat Family : లాండ్ అమ్మి.. కోటి రూపాయలు ఖర్చు పెడితే… కన్నీళ్లు పెట్టిస్తున్న గుజరాతీ తల్లీకొడుకుల వ్యథ..!
Gujarat Family : అమెరికా సైనిక విమానం ద్వారా అమృత్‌సర్‌కు తరలించిన 104 మంది అక్రమ భారతీయ వలసదారులలో లవ్‌ప్రీత్ కౌర్, ఆమె కుమారుడు ఉన్నారు. రూ. 1.05 కోట్ల ఖర్చుతో ప్రమాదకరమైన ప్రయాణం మెక్సికో-యుఎస్ సరిహద్దులో ముగిసింది.

Gujarat Family
Gujarat Family : అమెరికా కల చెదిరిపోయింది.. భర్తను కలవాలని తల్లిది ఆరాటం.. తండ్రిని చూడాలనేది కొడుకు కోరిక.. ఉన్న భూమి అమ్ముకుని మరి అమెరికా పరుగుపెట్టిన గుజరాత్ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా వెళ్లాలనే కలను నెరవేర్చుకునేందుకు అక్షరాలా రూ. కోటి ఖర్చు పెట్టినా ఫలితం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
డబ్బు పాయే.. అమెరికా కల చెదిరిపాయే అన్నట్టుగా మారింది ఈ గుజరాతీ కుటుంబం పరిస్థితి. ఏం చేయాలో తోచడం లేదు.. అమెరికాలో అడుగుపెట్టకుండానే మధ్యలోనే వెనక్కి పంపేయడంతో గుజరాత్ కుటంబం ఆకాంక్షలు అడియాసలయ్యాయి. అక్రమ మార్గంలో అమెరికాకు పయనమైన ఈ తల్లీకొడుకుల వ్యథ కన్నీళ్లు పెట్టిస్తోంది.
Read Also : జీతం చాలట్లేదు.. అప్పులు క్లియర్ చేసేద్దాం అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ మిస్టేక్స్ చేయొద్దు..
104 మంది అక్రమ భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం బుధవారం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకున్న తర్వాత తొలి బ్యాచ్ వారిని వెనక్కి పంపించారు. వారిలో 33 మంది హర్యానాకు చెందినవారు ఉండగా, 33 మంది గుజరాత్‌కు చెందినవారు, 30 మంది పంజాబ్‌కు చెందినవారు, ముగ్గురు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, ఇద్దరు చండీగఢ్‌కు చెందినవారు ఉన్నారు.
అమెరికాకు అక్రమమార్గంలో ప్రయాణం :
వీరంతా స్వదేశానికి తిరిగి రావడానికి ఒక్కొక్కరికి అంచనా వేసిన ఖర్చు 4,675 డాలర్లు (దాదాపు రూ. 4 కోట్లు అనమాట). వీరిలో కొందరు తమ భూమిని అమ్ముకుని అమెరికాకు వెళ్లారు. మరికొందరు అప్పులు చేశారు. అయితే, వీరందరి అమెరికా ఆశలు అడియాసలయ్యాయి.
అమెరికాలో అడుగుపెట్టేందుకు చాలామంది అక్రమమార్గంలో ప్రయాణిస్తుంటారు. దీన్నే డంకీ రూట్ అని పిలుస్తారు. ఈ అక్రమ మార్గం గుండా ప్రయాణించిన గుజరాత్ కుటుంబానికి చెందిన తల్లి లవ్‌ప్రీత్ కౌర్, ఆమె కొడుకు అత్యంత బాధాకరమైన అనుభవాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అమెరికా చేరుకునే క్రమంలో గుజరాత్ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. నివేదికల ప్రకారం.. లవ్‌ప్రీత్ భర్త చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాడు. అయితే, ఒక నెలలోనే వారి పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. అమెరికా చేరుకునేలోపే భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. లవ్‌ప్రీత్ కౌర్ జనవరి 2న తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా నుంచి అమెరికాకు బయలుదేరింది. అమెరికాలో ఉంటున్న తన భర్తను తిరిగి కలవాలని ఆమె ఎన్నో కలలు కన్నారు. అయితే, ఫిబ్రవరి 1న సైనిక విమానంలో ఆమెను భారత్‌కు తిరిగి పంపించడంతో ఆమె ప్రయాణం అకాలంగా ముగిసింది. అమెరికా నుంచి వెనక్కి పంపిన అక్రమ వలసదారుల మొదటి బృందంలో తల్లి కౌర్ సహా ఆమె కుమారుడు ఉన్నాడు.
భర్త కోసం అమెరికా వెళ్లినా నిరాశే :
30 ఏళ్ల లవ్‌ప్రీత్ కౌర్ తన భర్తను తిరిగి కలవడానికి అమెరికాకు వెళ్లింది. ఇందుకోసం ఆమెకు రూ. 1 కోటి కన్నా ఎక్కువ ఖర్చు చేసింది. కానీ, విధి మరోలా ఉంది. ఆమె తన భర్తను కలవకుండానే భారత్‌కు తిరిగి రావాల్సి రావడంతో ఆమె కల చెదిరిపోయింది. లవ్‌ప్రీత్ కౌర్ కష్టతరమైన ప్రయాణం పంజాబ్‌లో ప్రారంభమైంది. ఇందులో నాలుగు ఖండాలు విస్తరించిన ప్రమాదకరమైన అక్రమ మార్గం ఉంది. ఈ ప్రమాదకరమైన మార్గంలోనే ఆమె అమెరికాకు బయల్దేరింది.
ఈ ప్రయాణం కోసం గుజరాత్ కుటుంబానికి రూ. 1.05 కోట్లు నష్టం కలిగించింది. గ్రామ పెద్ద నిషాన్ సింగ్ ప్రకారం.. లవ్‌ప్రీత్, ఆమె కుటుంబం మొదట జనవరి 2న దుబాయ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి మాస్కోకు వెళ్లారు. ఆ తరువాత వివిధ లాటిన్ అమెరికన్ దేశాల గుండా ప్రయాణించారు. చివరకు హోండురాస్, గ్వాటెమాల మీదుగా మెక్సికో ద్వారా తన కొడుకుతో కలిసి అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
అయితే, ఆమె ఆకాంక్షలు మెక్సికో-అమెరికా సరిహద్దులో అడియాసలయ్యాయి. అక్కడ ఆమె ప్రయాణం అకస్మాత్తుగా ముగిసింది. అధికారులు అదుపులోకి తీసుకుని, అమృత్‌సర్‌కు తిరిగి పంపిన 104 మంది భారతీయులలో ఆమె కూడా ఉన్నారు. లవ్‌ప్రీత్ కుటుంబం 6 ఎకరాల సాగు భూమిని కలిగి ఉంది.
ఈ భూమిని అమెరికా ప్రయాణం ఖర్చుల కోసం తనఖా పెట్టింది. అమెరికాలో ఇప్పటికే నివసిస్తున్న ఆమె భర్త కొంత నిధులు పంపగా, మిగిలిన మొత్తాన్ని అప్పుల ద్వారా సమకూర్చారు. లవ్‌ప్రీత్ కథ ప్రత్యేకమైనది కాదు. ఆమెతో పాటు కుటుంబం పంజాబ్‌లోని వందలాది కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు అమెరికన్ కలను కొనసాగించడానికి తమ భూమిని తాకట్టు పెట్టారు.
‘డంకీ’ రూట్ అంటే ఏంటి? :
డంకీ రూట్ అనేది అనేక దేశాల గుండా ప్రయాణించే ప్రమాదకరమైన మార్గం. మానవ అక్రమ రవాణా ముఠాలు ఈ ప్రమాదకరమైన మార్గాల్లోనే వెళ్తుంటాయి. ఈ మార్గాల్లో ప్రయాణించాలనుకునే వ్యక్తుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తాయి. డంకీ రూట్‌లో ప్రయాణం ప్రమాదం. అడుగడుగునా ఆపదతో నిండి ఉంటుంది. సాధారణంగా దుబాయ్ లేదా షార్జా వంటి పశ్చిమాసియా విమానాశ్రయాల నుంచి వచ్చే ప్రయాణికులను మొదట అజర్‌బైజాన్ లేదా టర్కీ వంటి దేశాల ద్వారా తీసుకెళ్తారు.
Read Also : దేవుడా.. అమెరికా అడ్డదారిలో వెళ్లినోళ్ల కథలు.. దారిలో చావులు, పుర్రెలు.. ఒళ్లు గగుర్పొడిచే వ్యథలు చదివితే..
అట్లాంటిక్ దాటిన తర్వాత పనామా వంటి దేశానికి చేరుకుంటారు. చివరకు ఎల్ సాల్వడార్ ద్వారా మెక్సికో చేరుకుంటారు. ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన దశ అట్లాంటిక్ దాటిన తర్వాత ప్రారంభమవుతుంది.
స్థానిక ఏజెంట్లు రహస్యంగా గ్వాటెమాల నుంచి మెక్సికోకు టాక్సీలలో రవాణాను ఏర్పాటు చేస్తారు. 12 గంటల నుంచి 15 గంటల పాటు సాగే ఈ 500 నుంచి 600 కిలోమీటర్ల ప్రయాణంలో అనేక చెక్‌పోస్టులను దాటాల్సి వస్తుంది. దీనివల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి. అమెరికాలోకి ప్రవేశించడానికి అవకాశాలను వెతుక్కుంటూ వలసదారులు టిజువానా, మెక్సికాలి వంటి సరిహద్దు నగరాలకు చేరుకోవడానికి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు.