Egg man Guinness record : టోపీపై 735 ‘గుడ్లు నిలబెట్టి గిన్నిస్ రికార్డ్

735 గుడ్లు తలపై పెట్టుకుని పగలకుండా బ్యాలెన్స్ చేస్తు ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డు సాధించాడు.

Egg man Guinness World Records  : రెండు మూడు గుడ్లు చేతిలో పట్టుకుని భద్రగా పెట్టాలంటే సతమతమైపోతాం. డజను గుడ్లు షాప్‌ నుంచి జాగ్రత్తగా పగలకుండా ఇంటికి తీసుకురావడానికి నానా తంటాలు పడిపోతాం.అటువంటిదో ఓ వ్యక్తి తన తలపై ఓ టోపీ పెట్టుకుని ఆ టోపీపై ‘గుడ్లు’నిలబెట్టి రికార్డు సృష్టించాడు. మరి ఎన్ని గుడ్లు అనుకుంటున్నారు? రెండు లేదా మూడు అనుకుంటున్నారా? కాదు..పోనీ ఓ 10గుడ్లు అనుకుంటున్నారా?అస్సలే కాదు అంతకంటే ఎక్కువగా ఓ 50 నిలబెట్టటమంటే మాటలు కాదు అంటారా?అస్సలే కాదు. ఏకంగా 735 గుడ్లు తల టోపీపై ఉంచుకుని అందరిని షాక్ కి గురిచేశాడు. అతను అలా గుడ్లతో బ్యాలన్స్ చేస్తుంటే వామ్మో పడిపోతాయేమో అన్నట్లుగా మనం ఫీల్ అయిపోతాం. కానీ అతను మాత్రం చక్కగా టోపీపై 735 గుడ్లు నిలబెట్టి వావ్..వెరీ వెరీ గుడ్డు అనిపించాడు. అంతేకాదు వెరీ గుడ్డు రికార్డు సాధించాడు.

Read more :Wardrob Full Of Money : ఈ బీరువాల్లో ఉన్నవి బట్టలు కాదు..కరెన్సీ కట్టలు..

ఆ గుడ్డు రికార్డు వీరుడిని గుడ్డు మనిషి అంటారు. అదేనండీ ‘ఎగ్ మ్యాన్’ అంటారు. ఎందుకంటే అతనికి గుడ్లతో ఫీట్లు చేయటం కొత్తకాదు. అందుకే అతనికి ఎగ్ మ్యాన్ అనే పేరు వచ్చింది. తన టాలెంట్‌తో ప్రపంచ రికార్డు కొట్టాడు కూడా. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పశ్చిమ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్‌ మ్యాన్‌’గా పేరొందాడు. గ్రెగరీ అంటే పెద్దగా ఎవ్వరికి తెలీద. కానీ ఎగ్ మ్యాన్ అంటేఅందరికి గుర్తుంటుంది. ప్రపంచమంతా తిరిగి తన గుడ్ ట్యాలెంట్‌ను వివిధ దేశాల్లో ప్రదర్శించటం ఇతనికి అలవాటు. పలు టీవీ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. అలా అతను వరల్డ్‌ ఫేమస్‌ ఎగ్‌మ్యాన్‌గా పేరొందాడు.

Read more :‘Cordyceps sinensis’ : హిమాలయాల్లో పెరిగే ఈ ఫంగస్‌తో క్యాన్సర్‌కు మెడిసిన్ : ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వెల్లడి

కాగా..ఈ గుడ్ రికార్డు కోసం గ్రెగరీ ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజులు పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్‌ నిర్వహించిన గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు స్పెషల్‌ షోలో తలపై గుడ్లను పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్‌ చేస్తూ ప్రదర్శించాడు.అది చూసిన గిన్నీస్‌ రికార్డు ప్రతినిథులు కూడా ‘వావ్‌’ వెరీ గుడ్డు అని అనకుండా ఉండలేక పోయారట. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్‌ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్‌ రికార్డులో స్థానం సంపాధించుకున్నాడు గ్రెగరీ దా సిల్వా.

ట్రెండింగ్ వార్తలు