India for Russian oil imports: ద్వంద్వ వైఖరితో భారత్‌పై పాశ్చాత్య దేశాలు విమర్శలు చేస్తున్నాయి: రష్యా

 రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై పాశ్చాత్య దేశాలు విమర్శలు గుప్పిస్తుండడం సరికాదని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, భారత్ చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనిపై వస్తోన్న విమర్శలపైనే భారత్ లోని అమెరికా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పందించారు.

India for Russian oil imports: ద్వంద్వ వైఖరితో భారత్‌పై పాశ్చాత్య దేశాలు విమర్శలు చేస్తున్నాయి: రష్యా

India for Russian oil imports

Updated On : August 28, 2022 / 1:46 PM IST

India for Russian oil imports: రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై పాశ్చాత్య దేశాలు విమర్శలు గుప్పిస్తుండడం సరికాదని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, భారత్ చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనిపై వస్తోన్న విమర్శలపైనే భారత్ లోని అమెరికా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పందించారు.

పాశ్చాత్య దేశాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని చెప్పారు. నైతికతలేని ఆ దేశాల తీరు స్పష్టమవుతోందని అన్నారు. భారత్-రష్యా మధ్య వాణిజ్య రంగం మరింత బలపడుతుందని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య పలు రకాల చెల్లింపుల విధానాలు ఉన్నాయని చెప్పారు. రష్యాపై పాశ్చాత దేశాలు చట్టవిరుద్ధమైన ఆంక్షలు విధించాయని, అసలు ఆ ఆంక్షలను ఆయా దేశాలు కూడా పట్టించుకోకుండా రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాయని అన్నారు.

పాశ్చాత దేశాలు తమపై విధించిన ఆంక్షల ప్రభావం భారత్-రష్యా మధ్య వాణిజ్యంపై పడలేదని చెప్పారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. చెల్లింపుల విధానంలో మూడవ దేశ కరెన్సీని వినియోగించుకునేందుకు కూడా యంత్రాంగం ఉందని చెప్పారు. పాశ్చాత దేశాల తీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన, ఆహార ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నాయని అన్నారు.

Chinese construction work: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మాణాలు?