రియల్ లెజెండ్ ఇతడే : ఇటలీలో అంబులెన్స్ డ్రైవర్ అవతారమెత్తిన రగ్బీ స్టార్

ప్రపంచమంతా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అందరూ ఇంటికే పరిమితమయ్యారు. క్రీడాకారులు కూడా తమ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండిపోయారు. కానీ, ఇటలీ రగ్బీ స్టార్ Maxime Mbanda మాత్రం అందరిలా ఇంట్లో కూర్చోలేదు. కరోనా సంక్షోభంతో పోరాడుతున్న ఇటలీకి తన వంతు సాయం అందించే పనిలో నిమగ్నమయ్యాడు. (మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చినవారికి ఒడిషా సీఎం విజ్ఞప్తి)
అంబులెన్స్ డ్రైవర్ అవతారమెత్తాడు.. 13 గంటల షిప్ట్ ల్లో పనిచేస్తూ కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో సాయపడుతున్నాడు. నార్తరన్ ఇటలీలో ఫ్లాంకర్ రగ్బీ యూనియన్ కింద Zebre జట్టులో Mbanda రగ్బీ ప్లేయర్. దేశంలో ప్రాణాంతక కరోనా వ్యాప్తితో ఆడాల్సిన అన్ని మ్యాచ్ లు రద్దు అయిపోయాయి. కొవిడ్-19 కరోనా రక్కసి కోరలో ఇటలీలో అల్లకోల్లోల మైపోతోంది. కరోనా కాటుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన దేశాల్లో ఇటలీ ఒకటి. ఇప్పటివరకూ ఈ దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 13వేలకు పైగా చేరింది.
కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్ లీగ్స్ అన్ని రద్దు అయిపోయాయి. ఇదే సమయాన్ని మంచి అవకాశంగా మార్చుకున్నాడు Mbanda.. తాను చేయగలిగిన సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. 27 ఏళ్ల రగ్భీ ప్లేయర్ Mbanda ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు సపోర్ట్ అందిస్తున్నాడు. తన సొంతగడ్డపై కరోనా బాధితుల కోసం అంబులెన్స్ నడుపుతూ ఆరోగ్య అధికారులకు సాయపడుతున్నాడు. (అమెరికా వరల్డ్ రికార్డ్ : 24గంటల్లో 1480 కరోనా మరణాలు)