Ukraine Crisis Putin Plan : యుక్రెయిన్‌లో ఆ Donbas ప్రాంతంలో ఏం జరుగుతోంది? ఎందుకు పుతిన్ ఇక్కడే టార్గెట్ చేశారంటే?

యుక్రెయిన్, రష్యా మధ్య ఉద్రికత్త పరిస్థితులు తీవ్రతరం అవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటనతో మరింత తీవ్రమైంది. ఇంతకీ పుతిన్ చర్యల వెనుక బలమైన వ్యూహం ఇదేనా అనేది తెలుస్తోంది.

What’s Happening In Donetsk And Luhansk In Ukraine’s Donbas Region

Ukraine Crisis Putin Plan : యుక్రెయిన్, రష్యా మధ్య ఉద్రికత్త పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటనతో మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుక్రెయిన్‌ అనే దేశమే లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ టెలివిజన్‌ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. వాస్తవానికి పుతిన్‌ ఎప్పుడూ ఉక్రెయిన్‌ను మరో దేశంగా చూడలేదు. అదే విషయాన్ని ఆయన తన ప్రసంగంలోనూ వినిపించారు. యుక్రెయిన్ పై యుద్ధానికి దిగితే కఠిన ఆంక్షలు తప్పవని ఒకవైపు ప్రపంచ దేశాలు గట్టిగా హెచ్చరిస్తున్నా ఎంతమాత్రం వెనక్కి తగ్గేదిలే అన్నట్టు పుతిన్ తన వ్యుహాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. నాటో భారీ ఎత్తున ఆయుధాలను యుక్రెయిన్‌లోకి తీసుకొస్తున్నా పుతిన్ అదరడం లేదు.. బెదరడం లేదు.. ఏమాత్రం ఆలోచించకుండా డాన్ బాస్ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తించారు. పుతిన్ చర్యల వెనుక బలమైన వ్యూహం ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది.

తూర్పు యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ (Donbas) ప్రాంతం.. రష్యా, యుక్రెయిన్ మధ్య పెరుగుతున్న సంక్షోభంలో పుతిన్‌కు ఒక ఫ్లాష్ పాయింట్‌గా మారింది. ఇప్పుడు అది యుక్రెయిన్ భూ సరిహద్దులు, వ్యూహాత్మక ప్రభావంపై ఆధారపడింది. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు మరింత క్లిషమైన సమస్యకు దారితీశాయి. మిన్స్క్ ఒప్పందంలో భాగంగా ఏడు ఏళ్ల శాంతి ఒప్పందానికి ముగింపు పలికేందుకు పుతిన్ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రష్యా, యుక్రెయిన్‌పై దండయాత్ర చేసేందుకు పుతిన్‌కు ఇది ఒక సాకుగా కూడా కనిపిస్తోంది. ఇంతకీ వేర్పాటువాద ప్రాంతాలు ఎందుకు ఇంత ఘర్షణకు కారణమవుతాయనేది, అసలు ఈ Donetsk, Luhansk ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Donbas అంటే ఏమిటి? :
రష్యా 2014 దండయాత్రలో.. యుక్రెయిన్, క్రిమియన్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతం వేర్వేరు నియంత్రణలో కొనసాగుతోంది. అప్పుడే ఈ ప్రాంతాన్ని ప్రత్యేక భూభాగాలుగా విభజించారు. Donetsk, Luhansk ప్రాంతాల్లో కైవ్-నియంత్రిత భాగాలు, రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాద పీపుల్స్ రిపబ్లిక్‌లను DPR, LPRగా పిలుస్తారు. 2014లో యుద్ధాలతో Donetsk, Luhansk ప్రాంతాలు ఉక్రెయిన్ నుండి చాలా వరకు తెగిపోయాయి. పుతిన్ స్వతంత్ర రిపబ్లిక్‌లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో 2.3 మిలియన్లు, 1.5 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది ఈ ప్రాంతమంతా రష్యన్ జనాభాలోనే ఉన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులకు ఉక్రెయిన్ ప్రభుత్వానికి మధ్య 2014 నుంచి పోరాటం కొనసాగుతోంది. 14వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హింస, విభజన, ఆర్థిక మాంద్యం ఈ ప్రాంతాన్ని దెబ్బతీశాయి. అప్పటి నుంచి 2 మిలియన్లకుపైగా ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వలసవెళ్లారు. తూర్పు యుక్రెయిన్‌లో షెల్లింగ్ పశ్చిమ దేశాలలో కైవ్‌లో ప్రజలకు దాడి భయాన్ని మరింత పెంచింది. రష్యా తన బలగాలను మోహరించడంతో యుక్రెయిన్ సమీపంలో లక్ష యాభై వేల మందిలో తీవ్ర భయాందోళన నెలకొంది.

What’s Happening In Donetsk And Luhansk In Ukraine’s Donbas Region

Donbas చరిత్ర ఏంటి? Minsk ఒప్పందం అంటే ఏంటి? :
రష్యా, ఉక్రెయిన్ మధ్య చారిత్రక సంబంధాలు 9వ శతాబ్దం నాటివిగా చెబుతుంటారు. అధ్యక్షుడు పుతిన్ పదే పదే వ్యూహాత్మకంగా ఈ వారసత్వాన్ని కొనసాగించారు. 2014 ప్రారంభంలోనే ఉక్రెయిన్‌లో నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే మాస్కోకు మద్దతుగా అధ్యక్షుడిని దించేశారు. ఆ తరువాత, రష్యా యుక్రెయిన్, క్రిమియన్ ద్వీపకల్పంపై దాడికి దిగింది. ఆపై ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. యూరప్, యునైటెడ్ స్టేట్స్ ఈ చర్యను చట్టవిరుద్ధమని వ్యతిరేకించాయి. మాస్కో-మద్దతుగల వేర్పాటువాదులు రష్యా సరిహద్దులోని Donetsk, Luhansk తూర్పు పారిశ్రామిక ప్రాంతాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుగుబాటుదారులు కూడా ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి వారతా తమను తాము రిపబ్లిక్లనుగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాతే సంక్షోభం తీవ్రమైంది.. Donetsk, Luhansk రష్యా అనుకూల వేర్పాటువాదులు యుక్రెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించడానికి రెఫరెండం ప్రకటించారు.

కైవ్, పశ్చిమ దేశాలు రష్యా తిరుగుబాటుదారులకు దళాలు ఆయుధాలతో మద్దతు ఇస్తోందని ఆరోపించాయి. రష్యా మాత్రం యోధులు స్వచ్ఛంద సేవకులేనని సమర్థించింది. వేర్పాటువాదులకు కైవ్-మద్దతుతో దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. 2015లో రష్యా యుక్రెయిన్ Minsk శాంతి ఒప్పందాన్ని అంగీకరించాయి. డాన్‌బాస్ ప్రాంతంలో కైవ్, రష్యా-మద్దతుగల వేర్పాటువాదుల మధ్య వివాదానికి స్వస్తి పలికేందుకు ఫ్రాన్స్, జర్మనీల మధ్యవర్తిత్వ ప్రణాళికగా రూపొందించారు. అయితే ఆ ఒప్పందం ప్రకారం.. యుక్రెయిన్ రెండు ప్రాంతాలకు ప్రత్యేక హోదా, రష్యాతో సరిహద్దుపై నియంత్రణను తిరిగి పొందేందుకు ప్రతిఫలంగా గణనీయమైన స్వయంప్రతిపత్తిని కల్పించింది.

కానీ ఆ ఒప్పందం అక్కడే ఆగిపోయింది. ఒప్పందంలోని నిబంధనలను అమలు చేసే ఉద్దేశం యుక్రెయిన్‌కు లేదని పుతిన్ తేల్చిచెప్పేశారు. యుక్రెయిన్ ఒప్పందానికి సవరణలను కోరింది. సైనికంగా నష్టం జరిగిన తర్వాత మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. రష్యా నిబంధనలపై ఒప్పందంతో యుక్రెయిన్ విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయొచ్చునని పేర్కొంది. ప్రస్తుత నిబంధనలు అమలు చేస్తే.. అల్లర్లు, గందరగోళానికి దారి తీస్తుందని కైవ్ అధికారులు చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ ఇతర మిత్రదేశాలు ఈ ఒప్పందానికి మద్దతునిచ్చాయి. అన్ని పార్టీలకు పిలుపునిచ్చాయి. మాస్కో వేర్పాటువాద ప్రాంతాలలో 8లక్షల రష్యన్ పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది. రష్యా వేర్పాటువాదులకు ఆయుధాలకు మద్దతునిచ్చిందని యుక్రేనియన్ పాశ్చాత్య అధికారులు ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది.

డాన్‌బాస్‌తో పుతిన్‌కు ఒరిగేది ఏంటి? డాన్‌బాస్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? :
రష్యన్లు, యుక్రేనియన్లను ఒకే దేశానికి చెందిన వ్యక్తులుగా పుతిన్ అభివర్ణించారు. జూలైలో క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో దీనిపై ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. అందులో యుక్రెయిన్, నిజమైన సార్వభౌమాధికారమైన ప్రాంతంగా పేర్కొంది. రష్యా భాగస్వామ్యంతో మాత్రమే అది సాధ్యమవుతుందని రాశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం.. క్రిమియా Donetskలోని జనాభాలో సగానికిపైగా రష్యన్‌ను వారి స్థానిక భాషగా గుర్తించారు. వేర్పాటువాద తిరుగుబాటుదారులు కైవ్‌కు వ్యతిరేకంగా మద్దతుతో తిరుగుబాటుకు ఆజ్యం పోసేందుకు ఇదే ప్రాంతాన్ని వినియోగించుకున్నారు. మాస్కో సైతం ఈ ప్రాంతాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంది. అక్కడి ప్రజలను రక్షించడానికి తమ బలగాలను పంపుతున్నామనే సాకుగా పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది. కైవ్-నియంత్రిత డాన్‌బాస్‌ ప్రాంతంలో.. వేర్పాటువాద ప్రాంతాలు ఉక్రెయిన్‌కు తిరిగి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.

వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న ప్రాంతంలో 2021లో ఒక సర్వే ప్రకారం.. కొంత స్వయంప్రతిపత్తి హోదాతో లేదా లేకుండానే సగానికి పైగా రష్యాలో గత వారం రష్యాకు చెందిన స్టేట్ డూమా, డోనెట్స్క్, లుహాన్స్క్, రష్యన్ అనుకూల ప్రాంతాలను గుర్తించాలని పుతిన్‌కు విజ్ఞప్తి చేసింది. యూరోపియన్ యూనియన్ మాస్కోను అనుసరించవద్దని హెచ్చరించింది. సోవియట్ దురాక్రమణ నుంచి రక్షించడానికి 1949లో స్థాపించిన NATOకు యుక్రెయిన్‌ను బఫర్ జోన్‌గా కూడా మాస్కో భావిస్తోంది.  మరోవైపు.. NATO తూర్పు వైపు విస్తరణ రష్యాకు రెడ్‌లైన్ అని పుతిన్ ఎప్పుటినుంచో చెబుతూ వస్తున్నారు.

Read Also : Russia Invasion : దండయాత్ర మొదలైంది.. రష్యాపై ఆంక్షలు విధించాల్సిందే- బ్రిటన్ కీలక వ్యాఖ్యలు