వాట్సాప్‌లో ఈజీగా ‘పేమెంట్స్’ చేసుకోవచ్చు!

  • Published By: srihari ,Published On : June 15, 2020 / 02:55 PM IST
వాట్సాప్‌లో ఈజీగా ‘పేమెంట్స్’ చేసుకోవచ్చు!

Updated On : June 15, 2020 / 2:55 PM IST

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో పేమెంట్స్ ఆప్షన్‌ వచ్చేసింది. కొన్ని నెలలుగా పేమెంట్స్ ఆప్షన్‌పై ట్రయల్స్ తర్వాత వాట్సాప్ చివరిగా తమ యాప్‌లో పేమెంట్స్ రిలీజ్ చేసింది. ఇతర డిజిటల్ ప్లాట్ ఫాంల మాదిరిగానే సులభంగా వాట్సాప్ నుంచి డిజిటిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు.

ఇక్కడ కాదులేండీ.. బ్రెజిల్‌లో పేమెంట్స్ ఫీచర్ ప్రవేశపెట్టినట్టు ఫేస్ బుక్ సొంత మెసేజింగ్ యాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ ప్లాట్ ఫాం నుంచి నగదు పంపుకోవచ్చు.. ఇతరుల నుంచి నగదు పొందవచ్చు కూడా. గత ఏడాదిలోనే ఫేస్ బుక్ తమ యాప్ లో పేమెంట్స్ సర్వీసు ‘Facebook Pay’ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 

ప్రసుత్తం వాట్సాప్ పేమెంట్ సర్వీసును యూజర్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు.. ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, బిజినెస్ పే సర్వీసుకు మాత్రం నగదు పొందాలంటే 3.99 శాతం ప్రాసిసెంగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆరు నెంబర్ల PIN లేదా ఫింగర్ ఫ్రింట్ ఫీచర్ ద్వారా నగదు లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. వాట్సాప్ అకౌంట్ ద్వారా లింక్ చేసుకున్న Visa లేదా Mastercard క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు సపోర్ట్ చేస్తాయి. భారతదేశంలో కూడా కొన్ని నెలల నుంచి పేమెంట్స్ సర్వీసు వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ట్రయల్‌లో Facebook Pay సర్వీసుకు బదులుగా (UPI) మరో సిస్టమ్ వాడుతోంది.