బిగ్ ప్రాబ్లమ్ : వాట్సప్ ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఇండియాలోనే అధికం!

ప్రముఖ ఆన్ లైన్ మెసేజింగ్ సంస్థ వాట్సప్ వందలాది గ్రూపుల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ మెసేజ్ లు బహిరంగంగానే షేర్ అవుతున్నాయి.

  • Published By: sreehari ,Published On : January 8, 2019 / 08:59 AM IST
బిగ్ ప్రాబ్లమ్ : వాట్సప్ ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఇండియాలోనే అధికం!

ప్రముఖ ఆన్ లైన్ మెసేజింగ్ సంస్థ వాట్సప్ వందలాది గ్రూపుల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ మెసేజ్ లు బహిరంగంగానే షేర్ అవుతున్నాయి.

  • వందలాది వాట్సప్ గ్రూపుల్లో విపరీతంగా షేరింగ్.. 

  • గ్లోబల్ గా కంటే.. ప్రత్యేకించి భారత్ లోనే సమస్య తీవ్రం

ఇండియాలో పోర్నోగ్రఫీ పెద్ద సమస్యగా మారుతోంది. ప్రపంచ దేశాల్లో కంటే ఒక్క భారత్ లోనే చైల్డ్ పోర్నోగ్రఫీ అధికంగా ఉన్నట్టు ఓ విచారణలో వెల్లడైంది. ప్రముఖ ఆన్ లైన్ మెసేజింగ్ సంస్థ వాట్సప్ వందలాది గ్రూపుల నుంచి లక్షల మెసేజ్ లు షేర్ అవుతున్నాయి. అందులో అవసరమైన సమాచారంతో పాటు పోర్నోగ్రఫీ వంటి అన్ వాంటెడ్ ఇన్ఫర్మేషన్ సైతం స్పీడుగా స్ర్పెడ్ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ చాట్ బాక్సుల్లో స్ప్రెడ్ అయ్యే పోర్నోగ్రఫీ మెసేజ్ ల కంటే ఇండియాలోనే ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు ఇజ్రాయిల్ కంపెనీ ఒకటి గుర్తించింది. గతనెలలో రెండు ఎన్జీఓలకు చెందిన ఇజ్రాయెల్ పరిశోధకుల బృందం డజన్లకు పైగా వాట్సాప్ గ్రూపులను గుర్తించింది. థర్డ్ పార్టీ యాప్ ల నుంచి ఎవరి అనుమతి లేకుండానే వాట్సప్ గ్రూపుల్లోకి షేర్ అవుతున్నట్టు గుర్తించారు. ఇన్వైట్ లింకుల సాయంతో సులభంగా వాట్సప్ లో అడల్ట్ కంటెంట్ ను స్ర్పెడ్ చేస్తున్నట్టు నిర్ధారించారు. 

లక్ష 30వేలకు పైగా అకౌంట్ లపై నిషేధం..
వాట్సప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి అంటూ కొన్ని థర్డ్ పార్టీ యాప్ ల నుంచి లింకులను వందలాది వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నట్టు గుర్తించినట్టు టెక్ క్రంచ్ వెల్లడించింది. అడల్ట్ కంటెంట్ ను ప్రచారం చేయడానికి ప్రత్యేకించి ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఉన్నాయని పేర్కొంది. ఇక్కడి నుంచే చైల్డ్ పోర్నోగ్రఫీని మెసేజింగ్ ప్లాట్ ఫాంపై స్ప్రెడ్ చేస్తున్నట్టు గుర్తించమన్నారు. చైల్డ్ ఎక్సోలేషన్ విధానాన్ని అతిక్రమించిన లక్ష 30వేలకు పైగా వాట్సప్ అకౌంట్ లను 10 రోజుల్లోనే బ్యాన్ చేశారు. మరోవైపు గూగుల్ కూడా వాట్సప్ డిస్కవరీ యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.