Corona Waves WHO Warned : భవిష్యత్ లో మరిన్ని కరోనా వేవ్ లు తప్పవు.. హెచ్చరించిన డబ్ల్యూహెచ్ వో

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 2020 నుంచి అమల్లో ఉన్న కరోనా ఆంక్షల సడలింపుతోపాటు పలు కారణాల వల్ల వైరస్ వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్ లో మరిన్ని వేవ్ లు తప్పవని హెచ్చరించింది.

Corona Waves WHO Warned : భవిష్యత్ లో మరిన్ని కరోనా వేవ్ లు తప్పవు.. హెచ్చరించిన డబ్ల్యూహెచ్ వో

WHO warned

Updated On : December 31, 2022 / 12:03 PM IST

WHO Warned Corona Waves : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆ దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.  2020 నుంచి అమల్లో ఉన్న కరోనా ఆంక్షల సడలింపుతోపాటు పలు కారణాల వల్ల వైరస్ వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

భవిష్యత్ లో మరిన్ని వేవ్ లు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే 500కి పైగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ వ్యాపిస్తున్నాయని వెల్లడించింది. చైనాలో తీవ్రస్థాయిలో కరోనా కేసులు వెలుగు చూడడం ఆందోళనకరమని డబ్ల్యూహెచ్ వో ప్రతినిధి మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ప్రపంచ దేశాలు కరోనా ఆంక్షలు సడలించాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ అధికంగా వ్యాపిస్తోందని చెప్పారు.

Covid cases in January: దేశంలో కరోనా విజృంభించే ముప్పు.. తదుపరి 40 రోజులు కీలకం

వివిధ దేశాల్లో 500 ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ వ్యాపిస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని వేవ్ లు వచ్చే అవకాశం ఉందన్నారు. కొన్ని ఒమిక్రాన్ వేరింయట్లకు రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళనకరమని చెప్పారు. వీటిపై పోరాడేందుకు సరిపడా అస్త్రాలు ఉండటం ఉపశమనం కలిగించే అంశమని మరియా వాన్ కెర్ఖోవ్ వెల్లడించారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే కరోనా ప్రభావం తగ్గిందన్నారు.

చైనాతోపాటు పలు దేశాల్లో వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యే వారితోపాటు ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని చెప్పారు. చైనాలో కరోనా ఉదృతి పెరుగుదల తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. వ్యాక్సిన్ తోపాటు తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందించడానికి అవసరమైన ఔషదాలు, బెడ్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు.