Narges Mohammadi: 31 ఏళ్ల పాటు కటకటాల వెనుక.. నోబెల్ వచ్చిందనీ జైలులోనే తెలిసింది.. ఎవరీ నర్గెస్? ఎందుకు ఆమెకు నోబెల్ వచ్చింది?
నర్గెస్ మొహమ్మది, ఇది పేరు కాదు.. మానవత్వం, ఓదార్పు, బలమైన నాయకత్వానికి పర్యాయపదం. మహిళల సాధికారత, వారి హక్కుల కోసం ఆమె బలంగా పోరాడుతున్నారు. నిజానికి ఈ కాలంలో కూడా వారు చాలాసార్లు అణచివేత, దౌర్జన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది

narges mohammadi
Nobel Peace Prize: ఇరాన్‌లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పిన మానవ హక్కుల కార్యకర్త నర్గెస్ మహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి వరించింది. నర్గెస్ మొహమ్మది మహిళల హక్కులు, ప్రజాస్వామ్యం సహా అనేక సమస్యలపై చాలా చురుకుగా ప్రచారం చేస్తుంటారు. ఈ కారణంగా ఆమె చాలాసార్లు ఏళ్ల తరబడి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం కూడా ఆమె జైలులోనే ఉన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఆమె కథలను చదవడానికి కారణం బహుశా ఇదే.
నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రియిస్-అండర్సన్ శుక్రవారం ఓస్లోలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. నోబెల్ బహుమతితో 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ నగదు బహుమతి ఇస్తారు. ఇది ఒక మిలియన్ అమెరికా డాలర్లకు సమానం. డిసెంబరులో జరిగే కార్యక్రమంలో నోబెల్ బహుమతి విజేతలకు బంగారు పతకాలు, డిప్లొమాలను ప్రదానం చేస్తారు.
నర్గెస్ మహమ్మది ఎవరు?
నర్గెస్ మొహమ్మది, ఇది పేరు కాదు.. మానవత్వం, ఓదార్పు, బలమైన నాయకత్వానికి పర్యాయపదం. మహిళల సాధికారత, వారి హక్కుల కోసం ఆమె బలంగా పోరాడుతున్నారు. నిజానికి ఈ కాలంలో కూడా వారు చాలాసార్లు అణచివేత, దౌర్జన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. 2019లో పెరిగిన పెట్రోల్ ధరలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో మరణించిన వ్యక్తి స్మారక చిహ్నాన్ని సందర్శించడానికి ప్రయత్నించిన నర్గెస్ మొహమ్మదిని 2021లో అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Ravan vs Modi Puppet: కాంగ్రెస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్.. రాహుల్‌ను రావణుడితో పోల్చినందుకు మోదీని అదానీ పప్పెట్ అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి
*2021 సంవత్సరంలో నిర్బంధించిన తరువాత, నర్గీస్ మొహమ్మదిని టెహ్రాన్‌లోని అపఖ్యాతి పాలైన ఎవిన్ జైలుకు పంపారు. ప్రస్తుతం ఆమె ఇంకా జైలులోనే ఉన్నారు.
*బెరిట్ రీస్-ఆండర్సన్ ప్రకారం, నర్గెస్ మొహమ్మది 13 సార్లు జైలుకు వెళ్లారు. అందులో ఐదుసార్లు దోషిగా నిర్ధారించారు.
*51 ఏళ్ల నర్గెస్ మొహమ్మది 31 ఏళ్లు జైలు జీవితం గడిపారు.
*2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాది నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న తర్వాత నర్గెస్ మొహమ్మది 19వ మహిళ, అలాగే రెండవ ఇరాన్ మహిళ.
*ఇరాన్‌లో నిషేధించబడిన మానవ హక్కుల కేంద్రానికి నర్గెస్ మొహమ్మది ఉపాధ్యక్షురాలు.
*నర్గెస్ మొహమ్మదీకి 2018లో ఆండ్రీ సఖారోవ్ ప్రైజ్ కూడా లభించింది.
నర్గెస్ మొహమ్మది కలం పవర్
కటకటాల వెనుక ఉన్నప్పటికీ, నర్గెస్ మొహమ్మది ధైర్యం విచ్ఛిన్నం కాలేదు. ఆమె న్యూయార్క్ టైమ్స్ కోసం ఒక అభిప్రాయాన్ని రాసింది. తన కథనాల ఆధారంగా ఇరాన్ ప్రభుత్వానికి చాలాసార్లు ఆమె సవాలు విసిరారు. వాస్తవానికి, సెప్టెంబర్ 2022లో 22 ఏళ్ల మహ్సా అమినీ పోలీసు కస్టడీలో మరణించిన ఉదంతం అనంతరం ఇరాన్‌లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను హింసించింది. దీని కారణంగా 500 మందికి పైగా మరణించారు, 22,000 మందికి పైగా అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Mahadev App Case: కాల్ సెంటర్లు, సెలెబ్రిటీలు.. ఇంతకీ మహదేవ్ యాప్ కుంభకోణం ఏంటి? అన్ని వందల కోట్లు ఎలా కొల్లగొట్టారు?
నర్గెస్ మొహమ్మది కష్టానికి ఫలితం దక్కింది. నేడు ఆమె స్వరం కేవలం ఆమెది మాత్రమే కాదు. ఇరాన్ మహిళల గొంతుక, దాని ప్రతిధ్వని నేడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ ఈ సమయంలో ఆమె ప్రియమైన వారికి దూరంగా జైలులో ఉండడం శోచనీయం.