Britain : అక్షతా మూర్తి ఎవరు ? విమర్శలను ఖండించిన రిషి సునక్

ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని, బ్రిటన్ లో సంపాదిస్తున్న ప్రతి పెన్నీకి భార్య పన్ను చెల్లిస్తోందని, అంతర్జాతీయంగా ఆర్జిస్తున్న ఆదాయానికి పన్ను జమ...

Britain : అక్షతా మూర్తి ఎవరు ? విమర్శలను ఖండించిన రిషి సునక్

Britain

Updated On : April 9, 2022 / 11:15 AM IST

Rishi Sunak’s Wife : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కుమార్తె, బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ పై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఎవరో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. పన్ను చెల్లింపుల వ్యవహారంపై బ్రిటన్ లో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. గత నెలలో సునక్ సమర్పించిన మినీ బడ్జెట్ లో ప్రజలపై ఎడాపెడా పన్నులు వేశారని.. ఆయన భార్య మాత్రం ఇక్కడ పన్నులు చెల్లించకుండా భారత్ లో చెల్లిస్తున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. నాన్ డొమిసైల్ పన్ను హోదాపై వస్తున్న విమర్శలను బ్రిటన్ ఆర్థిక మంత్రి, అక్షతా మూర్తి భర్త తిప్పికొట్టారు.

Read More : covid cases : కట్టడిలోనే కరోనా.. దేశంలో కొత్తగా 1,150 కేసులు

ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని, బ్రిటన్ లో సంపాదిస్తున్న ప్రతి పెన్నీకి భార్య పన్ను చెల్లిస్తోందని, అంతర్జాతీయంగా ఆర్జిస్తున్న ఆదాయానికి పన్ను జమ చేయడం జరుగుతోందని వివరణనిచ్చారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె తనను పెళ్లి చేసుకుందనే కారణంతో ఆమె తన సొంత దేశంతో సంబంధాలు తెంచుకోవాలని అనడం కరెక్టు కాదన్నారు. ఆమెకు తన దేశమంటే ఎంతో ప్రేమ ఉందని, తల్లిదండ్రుల బాగోగులు చూసుకొనేందుకు ఆమె ఎప్పటికైనా భారత్ తిరిగి వెళ్లిపోతారని వెల్లడించారు. ఆమెలానే తనకు కూడా దేశమంటే ప్రేమ ఉందని, బ్రిటీష్ పౌరసత్వాన్ని ఎన్నటికీ వదులుకోననని తెలిపారు.

Read More : UIDAI Scam: భారీ ఆధార్ స్కామ్: రూ.13 వేల కోట్లకుపైగా కేంద్రానికి నష్ఠం

తన మావయ్య చూసి గర్విస్తానని, ఆయనపైనా దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రపంచస్థాయి వ్యాపార సంస్థను ఆయన తీర్చిదిద్దారని తెలిపారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, భారత్ ముఖచిత్రాన్నే ఆయన మార్చారని తెలిపారు. అక్షత పన్ను ఎగవేస్తున్నారనేది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని, తాను చట్టప్రకారం బ్రిటన్ లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని అక్షతా మూర్తి ప్రతినిధి తెలిపారు.