Charles Sobhraj: చార్లెస్ శోభరాజ్‌ను ‘బికినీ కిల్లర్’గా ఎందుకు పిలుస్తారు? అతను మొత్తం ఎన్ని హత్యలు చేశాడంటే?

వియాత్న మూలానికి చెందిన చార్లెస్ శోభరాజ్ 1944లో వియాత్నంలోని హూచిమిన్ నగరంలో జన్మించారు. అతనికి తొమ్మిది దేశాల్లో నేరప్రమేయం ఉంది. భారత్, నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కువకాలం నాలుగు దేశాల్లో మాత్రమే చార్లెస్ ఖైదీగా జీవితాన్ని కొనసాగించాడు. చార్లెస్ కు ‘ బికినీ కిల్లర్’ అనే పేరుంది.

Charles Sobhraj: చార్లెస్ శోభరాజ్‌ను ‘బికినీ కిల్లర్’గా ఎందుకు పిలుస్తారు? అతను మొత్తం ఎన్ని హత్యలు చేశాడంటే?

Charles Sobhraj

Updated On : December 22, 2022 / 8:27 AM IST

Charles Sobhraj: చార్లెస్ శోభరాజ్.. ఈ పేరు వింటేనే వరుస హత్యలు గుర్తుకొస్తాయి. కరడుగట్టిన హంతకుడు, ఫ్రాన్స్ కు చెందిన సీరియల్ కిల్లర్‌ జీవితం ఆధారంగా బీబీసీ, నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిలో వెబ్ సిరీస్‌లుసైతం రూపుదిద్దుకున్నాయి. అంతటి భయంకరమైన కిల్లర్. అతనికి 20కిపైగా హత్యల్లో  ప్రమేయం ఉంది. 78ఏళ్ల వయస్సు కలిగిన చార్లెస్.. తన చిన్నతనం నుండే నేరప్రవృత్తి కలిగి ఉన్నాడు. దీంతో దాదాపు అతను అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. నివేదికల ప్రకారం.. చార్లెస్ దక్షిణ, ఆగ్నేయాసియాలో దాదాపు 20 మంది పర్యాటకులను హత్యచేశాడు. ఇందులో 14 హత్యలు థాయ్‌లాండ్‌లో జరిగినవే కావటం గమనార్హం.

Charles Sobhraj: 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్న చార్లెస్ శోభరాజ్.. నేపాల్ కోర్టు ఆదేశం

1975లో అమెరికన్ టూరిస్ట్ కొన్నీ జో బ్రోంజిచ్‌ను హత్యచేసినందుకు చార్లెస్ శోభరాజ్‌కు నేపాల్ న్యాయస్థానం 2003లో జీవిత ఖైదును విధించింది. బ్రోంజిచ్ యొక్క కెనడియన్ భాగస్వామిని హత్యచేసినందుకు కూడా శోభరాజ్‌ను దోషిగా కోర్టు నిర్ధారించింది. దీంతో అతనికి 21ఏళ్లు పాటు జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ప్రస్తుతం అతనునేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 78ఏళ్ల వయస్సు కావటంతో పాటు అనారోగ్యకారణంగా ఇబ్బంది పడుతుండటంతో నేపాల్ సుప్రీంకోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. చార్లెస్ కు వ్యతిరేకంగా పెండింగ్ కేసులేమీ లేకపోతే వెంటనే విడుదల చేసి 15రోజుల్లోపు అతడిని స్వదేశానికి పంపించాలని నేపాల్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. చార్లెస్ ఢిల్లీలో ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి హత్యచేసిన కేసులో భారత్‌లోనూ జైలు శిక్ష అనుభవించాడు. 1976 నుంచి 1997 వరకు భారత్ లో చార్లెస్ జైలు జీవితాన్ని అనుభవించాడు. అయితే 1986లో జైలు నుంచి తప్పించుకున్నప్పటికీ.. పోలీసులు అతన్ని గుర్తించి మళ్లీ జైలుకు పంపించారు.

Crime News: భార్యతో గొడవ పడి.. 3వ అంతస్తు నుంచి రెండేళ్ల కొడుకుని తోసేసి, తానూ దూకేసిన తండ్రి

వియాత్న మూలానికి చెందిన చార్లెస్ శోభరాజ్ 1944లో వియాత్నంలోని హూచిమిన్ నగరంలో జన్మించారు. అతనికి తొమ్మిది దేశాల్లో నేరప్రమేయం ఉంది. భారత్, నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కువకాలం నాలుగు దేశాల్లో మాత్రమే చార్లెస్ ఖైదీగా జీవితాన్ని కొనసాగించాడు. చార్లెస్ కు ‘ బికినీ కిల్లర్’ అనే పేరుంది. 70వ దశకంలో చార్లెస్ ఆగ్నేయాసియాలో 12 మంది పర్యాటకులను హత్యచేశాడు. నీటిలో ముంచడం, గొంతు నులిమి చంపడం, కత్తితో లేదా సజీవదహనం చేయడం వల్ల చార్లెస్ హత్యలు చేసేవాడు. బీచ్‌లలో బికినీ ధరించిన టూరిస్ట్ అమ్మాయిలను ఎక్కువగా చంపేవాడు. దీంతో చార్లెస్ ను బికినీ కిల్లర్ అని కూడా పిలుస్తారు.