Pakistan Army Chief Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్‌తో యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు? యుద్ధకాంక్షతో ఎందుకు రగిలిపోతున్నాడు? అసలు లక్ష్యం ఏంటి?

దేశంలో కనీసం ఓ ట్రైన్ ని కూడా కాపాడుకోలేని దుస్థితిలో పాక్ ఆర్మీ ఉందనేది ఈ మధ్యనే జరిగిన హైజాక్ ఉదంతం నిరూపిస్తోంది.

Pakistan Army Chief Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్‌తో యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు? యుద్ధకాంక్షతో ఎందుకు రగిలిపోతున్నాడు? అసలు లక్ష్యం ఏంటి?

Updated On : April 25, 2025 / 12:44 AM IST

Pakistan Army Chief Asim Munir: భారత్ దాడి చేస్తే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తమ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. అసలు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైఖరి ఎందుకిలా ఉంది? తాము తప్పు చేసింది కాకుండా పదే పదే భారత్ ని కవ్వించే చర్యలకు ఎందుకు దిగుతున్నారు? యుద్ధమంటే ఆయనకు అంత ఆషామాషీగా ఉందా? యుద్ధానంతర పరిణామాలను కానీ అసలు వార్ అంటూ బిగిన్ అయితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అసిమ్ మునీర్ కు తెలీదా? మరి తెలిసి కూడా భారత్ తో యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నారు?

ప్రస్తుతం పాకిస్తాన్ సైనాధ్యక్షుడిగా ఉన్న అసిమ్ మునీర్ కు అక్కడి జనంలో పాపులారిటీ లేదు. అటు సైన్యంలోనూ పట్టు లేదనే విమర్శలున్నాయి. తన సామర్థ్యం ఏంటన్నది ఎవరూ గుర్తించడం లేదన్న తపన ఆయనలో ఎక్కువైపోయింది. ఇదే విషయాన్ని జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ చెబుతున్నారు. ఓవైపు బలూచిస్థాన్ నుంచి రెబల్స్ బెడద ఎక్కువ కావడం కూడా పాకిస్తాన్ లోని ప్రభుత్వాన్ని పెద్ద సమస్యగా మారింది.

తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ ఖైబర్ ఫక్త్ కనుమల నుంచి వచ్చి పడుతూ పదుల సంఖ్యలో సైనికులను మట్టుబెడుతున్నారు. మరోవైపు సింధ్ సరిహద్దుల్లో చేపట్టిన ఓ కెనాల్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో ఉంచినందుకు పంజాబ్ లో నిరసనల సంగతి సరేసరి.

దేశంలో కనీసం ఓ ట్రైన్ ని కూడా కాపాడుకోలేని దుస్థితిలో పాక్ ఆర్మీ ఉందనేది ఈ మధ్యనే జరిగిన హైజాక్ ఉదంతం నిరూపిస్తోంది. ఇలా అన్ని అంశాల్లో పాక్ ఆర్మీ చీఫ్ ప్రతిష్ట మసకబారిపోయింది. దీంతో కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చి తానూ సమర్ధుడనే అని అనిపించుకునేందుకు అసిమ్ మనీర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

Also Read: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ఆ వ్యాఖ్యలే జమ్ముకశ్మీర్ లో ముష్కరుల మారణహామానికి కారణమా?

పాకిస్తాన్ జనంలో లీడర్లకంటే ఆర్మీకే ప్రాధాన్యత ఎక్కువ. తాను ఏం చెబితే అది గుడ్డిగా నమ్మే జనం ఉన్నారు కాబట్టి భారత్ పై యుద్ధానికి అసిమ్ మునీర్ తహతహలాడుతున్నాడు. అయితే అది తనంతట తానుగా చేస్తే వ్యవహారం బెడిసి కొడుతుందని భయంతో.. ఇలా ఉగ్రదాడులను ప్రేరేపించడం, తద్వారా భారత్ యుద్ధానికి దిగితే గావుకేకలు పెట్టాలి అనేది అతడి ప్లాన్ గా తెలుస్తోంది.

అయితే, అసిమ్ మునీర్ ఆశించినట్లు యుద్ధమే వస్తే పాకిస్తాన్ భారత్ తో ఏమాత్రం సరిపోదు. కార్గిల్ వార్ సమయంలో జరిగింది వేరైనా ఆ యుద్ధంలో పాక్ తోక ముడిచి పారిపోవాల్సి వచ్చింది. మరోవైపు ఐఎంఎఫ్ సహా అనేక దేశాలను జోల పట్ట సాయం అడిగితే కానీ 7 బిలియన్ డాలర్ల అప్పు పుట్టని పాకిస్తాన్.. ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ను మరోసారి ఢీకొట్టాలి అనుకోవడం అతడి అత్యాశకు నిదర్శనం.

యుద్ధం చేయాలంటే కేవలం రక్షణ రంగ బడ్జెట్ భారీగా ఉంచుకుంటే సరిపోదు. యుద్ధానంతర పరిణామాలను కూడా ఎదుర్కొనే ఆర్థిక పరిపుష్టి అవసరం. అది పాకిస్తాన్ కు ఉందా లేదా అనేది మిగిలిన దేశాలకంటే ఆ దేశానికి ఎక్కువ తెలుసు. అయినా కూడా అడుగంటిపోయిన తన ప్రతిష్టను నిలుపుకునేందుకే ఇలా యుద్ధ తంత్రాన్ని కోరుతున్న పాక్ ఆర్మీ చీఫ్ కి దాని పరిణామాలు గ్రహించే తెలివి మాత్రం లేదనేది సుస్పష్టం.