Pope Francis Funeral : పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు ఎందుకు హాజరుకాలేదంటే? అసలు రీజన్ ఇదే!
Pope Francis Funeral : పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం సంతాపానికి నాలుగు రోజులు పట్టింది.

Pope Francis Funeral
Pope Francis Funeral : పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ఇజ్రాయెల్ టాప్ ఉన్నతాధికారులు హాజరుకావడం లేదు. పోప్ మరణం పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించిన తీరే ఇందుకు కారణం. ప్రపంచ ఆధ్యాత్మిక నేత పోప్ మరణించినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం సంతాపం తెలిపేందుకు నాలుగు రోజులు పట్టింది.
ఏదో తూతూమంత్రంగా సంతాపాన్ని తెలియజేసింది. ఇజ్రాయెల్ కార్యాలయం రెండు వ్యాఖ్యల్లో సంతాప ప్రకటనను విడుదల చేసింది. అందులో “పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఇజ్రాయెల్ రాష్ట్రం కాథలిక్ చర్చికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ సమాజానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని వేడుకుంటున్నాం” అని పేర్కొంది.
పోప్ మరణ వార్త తెలిసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ అధికారిక అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన సందేశాన్ని వివరణ లేకుండా తొలగించింది. అసలు ఆ సందేశంలో జెరూసలేంలోని వెస్ట్రన్ వాల్ వద్ద పోప్ ఫ్రాన్సిస్ ఫోటో ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం.. ఈ పోస్టు తొలగింపుకు ఒక తప్పదిమే కారణమని జెరూసలేం పోస్ట్ నివేదిక తెలిపింది.
పోప్ మరణం పట్ల ఇజ్రాయెల్ తీరు వివాదాస్పదమైంది. అంత్యక్రియలకు లో లెవల్ కేటగిరీ ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆ దేశం తీసుకున్న నిర్ణయంతో మరింత వివాదానికి దారితీసింది. ఇజ్రాయెల్ వాటికన్ రాయబారి యారోన్ సైడ్‌మాన్ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అయితే, చాలా ప్రధాన దేశాలు తమ దేశాధినేతలు లేదా ప్రభుత్వాలచే ప్రాతినిధ్యం వహిస్తాయి.
గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్ చర్యలను జాతి నిర్మూలనగా వర్గీకరించవచ్చో లేదో అంతర్జాతీయ సమాజం పరిశీలించాలని సూచించారు. గాజాలో మానవతా పరిస్థితిని సిగ్గుచేటుగా అభివర్ణించారు. పాలస్తీనా ప్రజల పట్ల ఆయన సానుభూతిని కూడా వ్యక్తం చేశారు.
పాలస్తీనియన్లతో పోప్ సంఘీభావం వ్యక్తం చేయడంపై ఇజ్రాయెల్‌లోని కొన్ని వర్గాలు, ముఖ్యంగా నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే మతపరమైన జాతీయవాద పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోప్ చేసిన కృషి, ఇజ్రాయెలీయుల పట్ల ఆయన సానుభూతి ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌లోని కొందరు ఆయన పాలస్తీనియన్ల పక్షం వహించారని నమ్ముతారు.
పాలస్తీనియన్ అథారిటీ పోప్ పట్ల గొప్ప గౌరవాన్ని ప్రదర్శించింది. ప్రధాన మంత్రి మొహమ్మద్ ముస్తఫా అంత్యక్రియలకు హాజరయ్యారు. పాలస్తీనియన్లు పోప్ విధానాల గురించి మాట్లాడారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, వాటికన్‌కు మధ్య ఉన్న విభేదాలు రోమ్‌లో జరిగే పోప్ అంత్యక్రియలలో స్పష్టంగా కనిపించవచ్చు.
ఇజ్రాయెల్ ముఖ్య నేతలు ఎవరూ హాజరుకారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళి అర్పించారు. అయితే, పోప్ అంత్యక్రియలకు హాజరు అయ్యే విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవు. ఇజ్రాయెల్ నుంచి ఉన్నత స్థాయి ప్రాతినిధ్యం లేకపోవడం ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై పోప్ వైఖరి పట్ల దేశం అసంతృప్తికి సంకేతంగా చెప్పవచ్చు.