Python : షాకింగ్.. సూపర్ మార్కెట్‌లో పే..ద్ద పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియాలోని ఓ సూపర్ మార్కెట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సూపర్ మార్కెట్ లోకి అనుకోని అతిథి వచ్చింది. మార్కెట్ కు వచ్చిన వారికి, సిబ్బందికి

Supermarket Python
Supermarket Python : ఆస్ట్రేలియాలోని ఓ సూపర్ మార్కెట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సూపర్ మార్కెట్ లోకి అనుకోని అతిథి వచ్చింది. మార్కెట్ కు వచ్చిన వారికి, సిబ్బందికి కాసేపు కంగారు పెట్టించింది. ఇంతకీ ఆ ఆనుకోని అతిథి మరెవరో కాదు.. పాము.
చెయిన్ వూల్ వర్త్స్.. సిడ్నీలోని నార్త్ వెస్ట్ శివారులో ఈ సూపర్ స్టోర్ ఉంటుంది. ఆ సూపర్ స్టోర్ లోనే పెద్ద పాము ఒకటి దర్శనమిచ్చింది. హెలినా అలాటి అనే మహిళ మసాలా పొడుల కోసం సూపర్ మార్కెట్ లో వెతుకుతూ ఉండగా.. ఆమెకు ఓ పెద్ద సర్పరం దర్శనం ఇచ్చింది. అది మూడు మీటర్ల పొడవుంది. అయితే విషపూరితం కాని డైమండ్ పైథాన్. స్టోర్ లో స్పైస్ జార్లు ఉంచే సెల్ఫ్ పైన కనిపించింది.
రాత్రికి చికెన్ చేసేందుకు అవసరమైన మసాల పొడి కోసం వెతుకుతున్నా. సరిగ్గా జార్ల వెనుక పాము నక్కి ఉంది అని హెలినా చెప్పింది. అయితే ఆమె స్నేక్ క్యాచర్ కావడం గమనార్హం. నాకు పాముల గురించి తెలిసి ఉండటం మంచిది అయ్యింది. నేను భయపడలేదు. కానీ సడెన్ గా కనిపించే సరికి కొంత షాక్ అయ్యాను అని ఆమె చెప్పింది.
హెలినా స్నేక్ క్యాచర్ గా పని చేసింది. సిడ్నీ వైల్డ్ లైఫ్ రెస్కూ ఆర్గనైజేషన్ కి కొన్నేళ్ల పాటు వాలంటీర్ గా పని చేసింది. దీంతో కళ్ల ముందు పెద్ద పాము సడెన్ గా కనిపించినా ఆమె భయపడేలుద. ఆ పాము మగది అని, తోడు కోసం వెతుకుతోందని ఆమె చప్పింది. అది విషపూరితమైనది కాదంది. దాని వల్ల ఎవరికీ ఎలాంటి సమస్య లేదంది. కాగా, పాముని పట్టుకుని స్థానిక అడవుల్లోకి వదిలేశారు. అయితే సూపర్ మార్కెట్ లోకి పాము ఎలా వచ్చిందో తెలియడం లేదు. సూపర్ మార్కెట్ లో పాముకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.