పెళ్లికి ఆహ్వానించలేదని ఆఫీస్‌లో రచ్చరచ్చ చేసిన సహోద్యోగి.. హెచ్‌ఆర్‌కుసైతం ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?

సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టు వైరల్ కావడంతో ఎక్కువ మంది నెటిజన్లు వధువు వైపు మద్దతుగా నిలిచారు.

పెళ్లికి ఆహ్వానించలేదని ఆఫీస్‌లో రచ్చరచ్చ చేసిన సహోద్యోగి.. హెచ్‌ఆర్‌కుసైతం ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?

Updated On : August 9, 2025 / 1:49 PM IST

Woman Files HR complaint against co worker: ప్రతీ వ్యక్తి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణాల్లో ఒకటి వారి వివాహం. పెళ్లి చేసుకునే సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులను ఆహ్వానించి వారి హర్షధ్వానాల మధ్య ఉత్సాహంగా వివాహం చేసుకుంటారు. ఇలాగే అమెరికాలో ఓ మహిళ వివాహం చేసుకుంది. అయితే, నీ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని ఓ సహోద్యోగి ఆఫీస్‌లో రచ్చరచ్చ చేసింది. హెచ్ఆర్‌కుసైతం ఫిర్యాదు చేసింది. అసలేం జరిగిందంటే..?

తన కార్యాలయంలో జరిగిన ఓ విచిత్రమైన ఘటన గురించి సదరు మహిళ రెడ్డిట్‌లో పోస్టు చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఇలా చెప్పింది.. నా ఆఫీసులో ఒక మహిళ ఉంది, ఆమెతో నేను స్నేహంగా ఉంటాను, కానీ ఆమెతో నాకు అంతగా పరిచయం లేదు. మేము అక్కడక్కడ చిన్నచిన్న చర్చలు జరిపాము, పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు. కలిసి భోజనం చేయలేదు. కార్యాలయం బయట మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను పెళ్లి చేసుకుంటున్నానని తెలిసుకొని ఆమె నా దగ్గరకు వచ్చి నీ పెళ్లికి నన్ను ఆహ్వానించరా..? అని అడిగింది. నేను నవ్వుతూ మా పెళ్లి ఒక చిన్న ఫంక్షన్ మాత్రమే.. దానికి దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే వస్తారని చెప్పాను. అయితే, ఈ సమాధానం సహోద్యోగిని బాధపెట్టింది. మొదట ఆమె మౌనంగా ఉంది. ఆ సమయంలో ఆ విషయం ముగిసిపోయింది.

కానీ, కొన్నిరోజుల తరువాత హెచ్ఆర్ నుండి నాకు కాల్ వచ్చింది. అదే సహోద్యోగి నాపై హెచ్ఆర్ కు ఫిర్యాదు చేసింది. ‘‘ఆమె ఆఫీసులో ప్రత్యేకంగా వ్యవహరిస్తోంది.. కొంతమందిని దూరంగా ఉంచడం ద్వారా కార్యాలయంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోంది’’ అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది.

తన వివరణ తీసుకున్న తరువాత హెచ్ఆర్ ఆమెకు ఇలా వివరించాడు.. వివాహం అనేది వ్యక్తిగత విషయం. వివాహ వేడుకకు ఎవరిని పిలవాలి.. ఎవరిని పిలవొద్దు అనేది వ్యక్తిగతం. అందులో ఏ కంపెనీ కూడా తన ఉద్యోగిని బలవంతం చేయదని సదరు ఉద్యోగికి హెచ్ఆర్ చెప్పినట్లు తెలిసింది.

అయితే, ఆ తరువాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పురాలేదట. తన పట్ల ఆమె వ్యంగ్యంగా ప్రవర్తించడం ప్రారంభించింది.. అంటే.. నేను వెళ్లేటప్పుడు ఒక విధంగా చూడటం, తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం చేస్తుందని తన పోస్టులో పేర్కొంది.

సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు ఎక్కువ మంది వధువు వైపు మద్దతుగా నిలిచారు. ఆమెకు తెలియని వ్యక్తిని ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఒక వినియోగదారుడు.. ‘బహుమతి లేకుండా వచ్చి.. ఎక్కువ ఆహారం తినే, ఇతరులను అసౌకర్యానికి గురిచేసే, మిగిలిపోయిన వస్తువులను ఇంటికి తీసుకెళ్లే అతిధి ఆమె కావచ్చు’’ అంటూ చమత్కరించారు.