Viral Video : కారు డోర్ తీసి భయపడిపోయిన యువతి..ఎందుకో తెలుసా ?

కారు డోర్ తెరిచి ఉండడం..అందులో ఏముందని ఓ యువతి చూసి హఢలిపోయింది. ఓ ఏలుగుబంటి కారులో ఉండి చూసి ఆ యువతి భయపడిపోయింది. ఈ వీడియో ట్విట్టర్ వేదికగా పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.

Viral Video : కారు డోర్ తీసి భయపడిపోయిన యువతి..ఎందుకో తెలుసా ?

Bear

Updated On : September 30, 2021 / 1:27 PM IST

Bear in Driver’s Seat :  ఈ మధ్యకాలంలో జంతువులు రోడ్ల మీదకు..ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జంతువులు ఎదురు పడగానే..ప్రజలు పరుగులు తీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చిరుత పులితో ఓ మహిళ వాకింగ్ స్టిక్ తో పోరాటం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా..కారు డోర్ తెరిచి ఉండడం..అందులో ఏముందని ఓ యువతి చూసి హఢలిపోయింది. ఓ ఏలుగుబంటి కారులో ఉండి చూసి ఆ యువతి భయపడిపోయింది. ఈ వీడియో ట్విట్టర్ వేదికగా పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.

Read More : NCDRC : ఫోన్ వేడెక్కుతోంది..రూ. 743 కోట్లు ఇవ్వండి

ఓ మహిళ పండ్ల బుట్ట తీసుకుని ఇంటి బయటకు రావడం వీడియోలో కనిపించింది. ఇంటి ఎదుట ఉన్న కారు వద్దకు ఆమె వచ్చింది. అయితే..అప్పటికే కారు డోర్ తీసి ఉండడం ఆమె ఆశ్చర్యపోయింది. కారులో ఎవరున్నారు ? అసలు డోర్ ఎలా తెరుచుకుంది అని మెల్లిగా చూసింది. కారులో ఉన్న ఆకారం చూసి గుండె ఆగినంత పనైపోయింది. కారు డోర్ పెట్టేందుకు గట్టిగా ప్రయత్నించింది. కానీ..అందులో ఉన్నది బలంగా నెట్టేయడంతో..డోర్ మూసివేయడం ఆమె వల్ల కాలేదు.

Read More : shortest cow Rani Died : ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు ‘రాణి’ మృతి

వెంటనే పండ్ల బుట్టను అక్కడే పారేసి..ఇంట్లోకి పరుగులు తీసింది. కారులో ఉన్నది ఎలుగుబంటి. మెల్లిగా కారు దిగి..కొద్దిదూరం వెళ్లింది. మరలా కారు దగ్గరకు వచ్చింది. కారు ఎక్కుదామని అనుకుందో..ఏమో..రోడ్డుపై పడి ఉన్న పండ్ల బుట్ట దగ్గరకు వచ్చింది. 2021, సెప్టెంబర్ 19వ తేదీన ట్విట్టర్ వేదికగా ఈ వీడియో పోస్టు అయ్యింది. చాలా మందే ఈ వీడియోస్ చూసి కామెంట్స్ చేస్తున్నారు.