Old Baby : జన్యులోపం.. వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి

పుట్టుకతోనే వృద్దాప్య లక్షణాలతో జన్మించింది ఓ చిన్నారి. ఈ ఏడాది జూన్ లో ఓ మహిళ ఈ వృద్దాప్య లక్షణాలు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది.

Old Baby : జన్యులోపం.. వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి

Old Baby

Updated On : September 5, 2021 / 3:49 PM IST

Old Baby : మాతృత్వ స్పర్శ ఇచ్చే ఆనందం మారేది ఇవ్వలేదు. స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పుట్టిన బిడ్డ కేరింతలు కొడుతూ అరుస్తుంటే మరెంతో ఆనందంగా ఉంటుంది. అలాకాక.. ఏదైనా అనారోగ్య సమస్యతో బిడ్డ జన్మిస్తే తల్లి హృదయం తల్లడిల్లుతోంది. ఇలాంటిదే దక్షిణాఫ్రికాలో ఓ సంఘటన జరిగింది. ఓ మహిళ వృద్దాప్య లక్షణాలతో ఉన్న శిశువుకు జన్మనించింది. ఆ శిశువును చూసి స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ బిడ్డను చూసిన తల్లి మాత్రం ఏం స్పందించడం లేదు. ఎందుకంటే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదు. తల్లికంటే పెద్ద వయసు ఉన్న మహిళలా కనిపిస్తోంది ఆ చిన్నారి. ఆ పాపకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ పాప దక్షిణాఫ్రికా తూర్పు కేప్ లోని లిబోడ్ కు చెందిన గ్రామంలో మానసిక వికలాంగురాలైన 20 ఏళ్ల మహిళకు జూన్ లో జన్మించింది. ఆ చిన్నారి ప్రొజిరియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి కలిగిన పిల్లలు ప్రపంచంలో చాలా తక్కువమంది ఉన్నారు. పాప జన్మించగానే ఆమె అమ్మమ్మ ఎదో లోపం ఉన్నట్లు గుర్తించింది. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. తల్లిని పాపను పరీక్షించిన వైద్యులు ఇది చాలా అరుదైన ప్రగతిశీల జన్యుపరమైన వ్యాధి అని తేల్చారు. తల్లి ఆరోగ్యపరిస్థితి సరిగా లేకపోవడం వల్లనే ఈ వ్యాధి వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం తూర్పు కేప్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్ సభ్యుడిగా ఉన్న సిఫోకాజి మణి లుసితి, ప్రొజిరియాతో జన్మించిన చిన్నారికి తగిన సాయం, మద్దతు అందించాలని.. నవజాత శిశువును ఎగతాళి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి అందవలసిన సాయం అందిస్తామని వివరించారు.