Viral Video: సింహం పిల్లలను కౌగిలించుకొని ఆటలాడుతున్న మహిళ.. వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం
అస్పినాల్ సింహం పిల్లలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె చేసిన పనిపట్ల

freya aspinall
Lion Cubs: ఓ మహిళ బెడ్ పై పడుకొని నాలుగు సింహం పిల్లలను కౌగిలించుకొని ఆటలాడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తుండగా.. మరికొందరు ఆమె తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటీష్ కు చెందిన ఫ్రెయా ఆస్పినాల్ అనే మహిళ నాలుగు సింహం పిల్లల రక్షించి.. వాటిని పెంచుకుంటుంది. రాత్రివేళ పడుకునే సమయంలో బెడ్ పై వాటితో ఆటలాడుకుంటున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్రెయా ఆస్పినాల్ ఇలా రాసింది.. నేను రాత్రి ఎలా నిద్రపోతాను (పెంపుడు జంతువులు కాదు).. కొన్ని నెలల క్రితం మేము నాలుగు సింహం పిల్లలను రక్షించాము. కొందరు వ్యక్తులు జంతువులను బలవతంగా బందీఖాలో ఉంచారు. ఆ సమయంలో ఈ సింహం పిల్లలు జన్మించాయి. అయితే, వాటిని రక్షించి, నేను వాటిని పెంచే బాధ్యతను ప్రారంభించాను. మేము ఇంతకు ముందు రక్షించిన, పెంచిన ఇతర సింహాలతో చేసినట్లే.. వీటిని ఆఫ్రికాకు పంపించాలనేది మా ప్రణాళిక. అయితే, ఇప్పుడు వాటి ప్రాణాలను రక్షించడానికి ఇది ఏకైక మార్గం అని అస్పినాల్ చెప్పారు.
అస్పినాల్ సింహం పిల్లలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె చేసిన పనిపట్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘నా జీవితంలో నేను ఎవరికీ ఎక్కు అసూయపడలేదు’.. అని వినియోగదారు చెప్పగా.. మరికొరు.. మీరు ఈ అందమైన జీవులకు సంపూర్ణ దేవదూత, చాలా ధైర్యంగా ఉన్నారని పేర్కొంది. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం అస్పినాల్ వీడియో పట్ల తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. అడవి జీవులు వాటి సహజ ఆవాసాలకు చెందినవి. మానవుల మంచంలో కాదు. అని వినియోగదారుడు పేర్కొనగా.. రక్షించడం ప్రశంసనీయం.. అయినప్పటికీ, అడవి జంతువులకు పునరావాసం కల్పించడానికి ఇది మార్గం కాదు అని మరో నెటిజన్ పేర్కొనగా.. అవి వేటాడం నేర్చుకోవాలి.. పెంపుడు జంతువులుగా పరిగణించకూడదని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
View this post on Instagram