Mama Uganda : 40 ఏళ్ల వయసులో 44 మంది పిల్లకి జన్మనిచ్చిన మహిళ.. అరుదైన కేసుగా చెబుతున్న వైద్యులు

ఆమె వయసు 40.. ఆమెకు 44 మంది పిల్లలు. ప్రపంచంలోనే పిల్లల్ని కనడంలో అరుదైన కేసుగా వైద్యులు చెబుతున్న ఆప్రికన్ మహిళ కథ వింటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

Mama Uganda : 40 ఏళ్ల వయసులో 44 మంది పిల్లకి జన్మనిచ్చిన మహిళ.. అరుదైన కేసుగా చెబుతున్న వైద్యులు

Mama Uganda

Updated On : April 12, 2023 / 2:21 PM IST

Mama Uganda : ఒకప్పుడు ఇద్దరు సంతానం ఉండేలా ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు ఒకరు ముద్దు అనే పరిస్థితికి వచ్చింది. ఇక ఆలస్యమవుతున్న వివాహాలు, వయసు పెరిగే కొద్ది ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులు కలిపి ఒక్కరిని కనడానికి కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆఫ్రికన్ (African) మహిళ 44 మంది పిల్లలకి జన్మనిచ్చింది. ప్రపంచంలోనే పిల్లల్ని కనడంలో అరుదైన కేసుగా వైద్యులు చెబుతున్న ఆ మహిళ కథా కమామీషు చదవండి.

Naatu Naatu : ఇంకా తగ్గని నాటు నాటు క్రేజ్.. వైరల్ అవుతున్న బేస్ బాల్ స్టేడియం!

తూర్పు ఆఫ్రీకాకు చెందిన నబతాంజీ ( Mariam Nabatanzi) అనే మహిళ గురించే ఇప్పుడు చెప్పబోయేది. ఈమెను అక్కడి వారంతా ‘మామా ఉగాండా’ (Mama Uganda) అని పిలుస్తుంటారు. నబతాజీ పేరెంట్స్ ఆమెను 12 ఏళ్ల వయసులో అమ్మేశారట. ఆ వయసులో ఆమెకు పెళ్లైంది. అక్కడ్నుంచి ఆమె కథ మొదలైంది. వరుసగా పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమెకు 40ఏళ్లు.. 44 మంది పిల్లలు. ఈ కథలో నబతాంజీ దంపతులు ఇంతమందిని ప్లాన్ చేసుకుని మాత్రం కనలేదు. ఈమెకు ఒకే సైకిల్ లో ఎక్కువ ఎగ్స్ విడుదల అవడం (hyperovulation) వల్ల ఒకే కాన్పులో ఎక్కువమందికి జన్మనిచ్చింది. నాలుగు కాన్పుల్లో కవలలు (twins) ఐదు కాన్పుల్లో ముగ్గురు (triplets).. ఐదు కాన్పుల్లో సెట్ కి నలుగురు..ఒకసారి మాత్రమే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది నబతాంజీ. జన్యుపరంగా (genetic) అరుదైన కేసుగా గైనకాలజిస్ట్ లు (gynaecologist) ఈ కేసును గుర్తించారు. ఈ ప్రత్యేక కేసులో ఆమె గర్భనిరోధక మాత్రలు వాడే పరిస్థితి కూడా కాదని ఈమె కేసును ట్రీట్ చేసిన ములాగో హాస్పిటల్ (Mulago Hospital) వైద్యులు చెబుతున్నారు.

corona effect : 2 ఏళ్ల తర్వాత కాఫీ స్మెల్ గుర్తుపట్టిన మహిళ ఎమోషనల్ వీడియో వైరల్

ఇక నబతాంజీకి పుట్టిన 44 మంది పిల్లలో 6 గురు చనిపోయారు. 20 మంది అబ్బాయిలు, 18 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ భారీ కుటుంబాన్ని పోషించలేకపోయాడో ఏమో.. నబతాంజీ భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడట.  ప్రస్తుతం ఒంటరి మహిళ అయినా ఆమె వీరందరినీ ధైర్యంగా సాకుతోంది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతమంది పిల్లల్ని పెంచగలుగుతున్నందుకు నబతాంజీకి హ్యాట్సాఫ్ చెప్పాలి.