పెళ్లీ.. పిల్లలు లేని మహిళలే ఆరోగ్యవంతులంట!!

ఫ్యామిలీల్లో లేదా తెలిసిన లేడీస్ ఓ వయస్సుకు వచ్చారని తెలియగానే క్యాజువల్‌గా వచ్చే టాపిక్. ఇక పెళ్లి అయిందంటే తర్వాత పిల్లల గురించే. ఇద్దరు పిల్లలు కావాలంటే ఈ వయస్సులో పెళ్లి అయితేనే పాజిబిలిటీ ఉంటుందని భయపెట్టేసి పెళ్లి చేసేస్తుంటారు. అలాంటి మైలురాళ్లు జీవితంలో అందరికీ కలిసిరావు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పెళ్లీ.. పిల్లలు లేని మహిళలే ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందది.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌కు చెందిన బిహేవియరల్ సైన్స్ ప్రొఫెసర్ పాల్ డోలన్ ఇలా వెల్లడించారు. ‘వివాహం చేసుకున్న వారే సంతోషంగా ఉన్నారని నాకు కొందరు చెప్పారు. అదెప్పుడంటే తన భాగస్వామి సమక్షంలో అడిగినప్పుడే ఇలా వెల్లడించారు. సింగిల్ గా ఉన్నప్పుడు చెప్పిన సమాధానం వేరేలా ఉంది. మహిళలం కాబట్టే పెళ్లి త్వరగా అయిపోయిందని, మగాడిగా పుట్టి ఉంటే పెళ్లి చేసుకునే వాళ్లమే కాదంటూ చెప్పుకొచ్చారు’ అని తెలిపారు.
సర్వే ప్రకారం.. పెళ్లి అవడంతో పురుషులకు ఎక్కువ బెనిఫిట్‌లు ఉన్నాయి. రిస్క్‌లు ఎక్కువ తీసుకోరు. ఎక్కువ సంపాదన పైనే ధ్యాస పెడతారు. ‘మహిళల విషయానికొస్తే తక్కువ వయస్సులోనే చనిపోతారు. అత్యంత సంతోషంగా ఉన్న మహిళల్లో పెళ్లికాని వారు, పిల్లలు లేని వారే ఎక్కువగా ఉన్నారు’ అని వెల్లడించారు.
దీని మొత్తానికి ఆధారంగా అమెరికన్ టైమ్ యూజ్ సర్వే(ఏటీయూఎస్)ను చూపించారు. ఇందులో అవివాహితులు, పెళ్లి అయిన వారు, విడాకులు తీసుకున్న వారు, విడిగా బతుకుతున్న వారిపై సర్వే నిర్వహించారు. చివరికి కంక్లూజన్‌ను హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ అనే పుస్తకంలో రాశారు. అందులో అవివాహితులే ఎక్కువ సంఖ్యలో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.