women cant appear in Adds : ఐస్‌క్రీమ్ యాడ్ వివాదం..మహిళలపై నిషేధం విధించిన ప్రభుత్వం
ఇరాన్‌లో ఇటీవల రిలీజైన ఓ ఐస్‌క్రీమ్ యాడ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఓ ఐస్‌క్రీమ్ యాడ్ లో నటించిన మహిళ హిజాబ్ ను సక్రమంగా ధరించలేదట. అందుకని ఏకంగా ఇరాన్ ప్రభుత్వం రంగంలోకి దిగి ఏకంగా మహిళలపై నిషేధం విధించింది.అడ్వర్టైజ్మెంట్లు, కమర్షియల్స్‌లో మహిళలను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది.

iran govt women cant appear in advertisements
iran govt women cant appear in advertisements : ఇరాన్‌లో ఇటీవల రిలీజైన ఓ ఐస్‌క్రీమ్ యాడ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఓ ఐస్‌క్రీమ్ యాడ్ లో నటించిన మహిళ హిజాబ్ ను సక్రమంగా ధరించలేదట. అందుకని ఏకంగా ఇరాన్ ప్రభుత్వం రంగంలోకి దిగి ఏకంగా మహిళలపై నిషేధం విధించింది.అడ్వర్టైజ్మెంట్లు, కమర్షియల్స్‌లో మహిళలను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది.
మాగ్నమ్ ఐస్‌క్రీమ్ యాడ్‌లో ఓ మహిళ నటించింది. ఆ యాడ్‌లో ఆమె తన హిజాబ్‌ను లూజ్‌గా ధరించింది. దీంతో ఇరాన్ మతపెద్దలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ యాడ్ పై సీరియస్ అయ్యారు. ఐస్‌క్రీమ్ కంపెనీ డోమినోపై చర్యలు తీసుకోవాలని ఇస్లామిక్ మత గురువులు కోరారు. మహిళల విలువలను కించపరిచేలా ఆ యాడ్ ఉందంటూ మండిపడ్డారు. అసలే మహిళలపై అర్థం పర్థం లేని ఆంక్షలు విధించే ఇరాన్ ప్రభుత్వం దీన్ని మరింత ఎక్కువ చేసింది. ఏకంగా ఇరాన్ సాంస్కృతిక శాఖ కొత్త ఆదేశాలు జారీ చేస్తూ.. అడ్వర్టైజ్మెంట్లు, కమర్షియల్స్‌లో మహిళలను నిషేధించాలని ఆదేశించింది.
మహిళలపై ఇటువంటి ఆదేశాలకే కాదు ఇరాన్ ప్రభుత్వం మహిళలపై గతంలో కూడా ఇటువంటి ఆంక్షలే విధించింది. మహిళలు పిజ్జా లేదా శాండ్‌విచ్ తింటూ స్క్రీన్‌పై కనిపించకూడదని హుకుం జారీ చేస్తూ..సెన్సార్షిప్ నిబంధనలు వెల్లడించింది. అంతేకాదు..పనిచేసే చోట మహిళలకు పురుషులు టీ సర్వ్ చేయకూడదని ఆదేశించింది. అలాగే మహిళలు లెదర్ గ్లౌవ్స్ ధరించి కనిపించకుండా సెన్సార్ అమలు చేయాలని ఆదేశించింది.