Women slapped French President : ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన మహిళ .. రెండేళ్లలో ఇది రెండో ఘటన

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ చెంప ఛెళ్లుమనిపించింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Women slapped French President : ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన మహిళ .. రెండేళ్లలో ఇది రెండో ఘటన

Women slapped French President Emmanuel Macron

Updated On : November 22, 2022 / 1:34 PM IST

Women slapped French President : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ చెంప ఛెళ్లుమనిపించింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం (నవంబర్ 21,2022) ఎమ్మానుయేల్ నడుస్తూ వెళ్తుండగా ఆలివ్ గ్రీన్ టీషర్ట్ ధరించిన ఓ మహిళ సడెన్ గా రియాక్ట్ అయ్యింది. ఎమ్మానుయేల్ చెంపపై కొట్టింది. దీంతో అక్కడున్న మీడియాతో పాటు మాక్రాన్ సెక్యూరిటీ సిబ్బంది షాక్ అయ్యారు.వెంటనే తేరుకుని ఆమెను పక్కకు లాగేశారు. కాగా మాక్రాన్ కు రెండేళ్లలో పౌరుల నుంచి రెండుసార్లు ఇటువంటి అనుభవం ఎదురైంది. 2021 జూన్ లో ఓ వ్యక్తి మాక్రాన్ ను పబ్లిక్ లోనే చెప్పుతో కొట్టాడు. ఈ ఘటన అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దేశాధ్యక్షుడిపై దాడి చేసిన సదరు వ్యక్తికి శిక్ష విధించారు. ఈక్రమంలో మరోసారి మాక్రాన్ పై ఓ మహిళ చెంప దెబ్బ కొట్టటం మరో సంచలనంగా మారింది.

కాగా..ఫ్రాన్స్ లోని డ్రోమ్ రీజియన్ లోని టైన్ హెర్మిటేజ్ టౌన్ లో ఫుడ్, రెస్టారెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన కోవిడ్ నిబంధనలను మరింత సరళతరం చేసారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంత మంది వద్దకు మాక్రాన్ వెళ్లారు. ఇంతలో ఊహించని విధంగా అక్కడున్న ఓ మహిళ మాక్రాన్ చెంపఛెళ్లుమనిపించింది. అక్కడున్న ఓ వ్యక్తితో మాట్లాడేందుకు మాక్రాన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.