WHO : కొవిడ్ కంటే డేంజర్, మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలి

కొవిడ్‌పై అత్యవసర స్థితి లేనంత మాత్రాన ప్రమాదం తప్పినట్లు కాదు. ప్రపంచం కోవిడ్ కంటే ప్రమాదకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి.

WHO : కొవిడ్ కంటే డేంజర్, మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలి

Next Pandemic Wran WHO

Updated On : May 24, 2023 / 11:17 AM IST

Next Pandemic Warn WHO Chief : కోవిడ్ యావత్ ప్రపంచాన్నే కుదిపేసింది. పలు విడతలుగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రాణాలకు హరించివేసింది. ఇక ఈ మహమ్మారి ముప్పు తప్పిందని రిలాక్స్ అయ్యే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో హెచ్చరిక చేసింది. కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోం..!!

కొవిడ్ కంటే ప్రమాదకరమైన మహమ్మారి పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని టెడ్రోస్ అధనోం తాజాగా హెచ్చరించారు. రాబోయే మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని సోమవారం (మే22,2023)న హెచ్చరించారు. COVID-19 మహమ్మారి కోసం గ్లోబల్ ఎమర్జెన్సీ స్టేటస్‌ను ముగించిన వారం తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ సూచనలు చేశారు. ‘‘కొవిడ్‌పై అత్యవసర స్థితి (emergency) ఎత్తివేసినంత మాత్రాన కోవిడ్ ముప్పు తప్పినట్లు కాదన్నారు.

76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో టెడ్రోస్ తాజాగా ప్రపంచ ఆరోగ్య పరిస్థితులపై తన నివేదికను సమర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతు కొత్త వేరియంట్ల కారణంగా మరో మహమ్మారి పుట్టుకకు అవకాశాలున్నాయని..దీంతో మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. అవి కోవిడ్ కంటే ప్రాణాంతకమైన వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. వివిధ రకాల సమస్యలు మూకుమ్మడిగా పుట్టుకొస్తున్న క్రమంలో అన్ని సందర్భాలకూ తగిన ప్రపంచ స్థాయి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోవిడ్ ఆఖరిది కాదు మరో సంక్షోభం కచ్చితంగా వస్తుంది. అప్పుడు దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు అందరు సిద్ధంగా ఉండాలని దానకి తగిన మార్గదర్శకాలను అనుసరించాలని సూచిచారు.ప్రతీ ఒక్కరు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.