World Population Day 2023 : లింగ సమానత్వం, స్త్రీ సాధికారతే లక్ష్యంగా .. ప్రపంచ జనాభా దినోత్సవం
జనాభా పెరుగుదలతో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, పర్యవసానాలు వాటిపై అవగాహన కల్పించడానికి ఏటా 'ప్రపంచ జనాభా దినోత్సవాన్ని' జరుపుతారు. అయితే ఈ సంవత్సరం లింగ సమానత్వంపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారత కల్పిండమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

World Population Day 2023
World Population Day 2023 : రోజు రోజుకీ ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. దాంతో ఆర్ధిక సంక్షోభం, పేదరికం పెను సవాలుగా మారుతోంది. 1990 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం 45/216 ద్వారా ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ జరపాలని నిర్ణయించింది. పెరుగుతున్న జనాభా, పర్యావరణం, అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కలిగించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
India Population : జనాభాలో అగ్రస్థానం.. భారత్‌కు వరం, చైనాకు కలవరం
మొదటి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11, 1990 న 90 కి పైగా దేశాల్లో ఈ దినోత్సవం నిర్వహించబడింది. ప్రపంచ జనాభా పెరుగుదలతో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, పర్యవసానాలు వాటిపై అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. జనాభా సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2022 నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరింది. కాని అందరికీ అన్నీ అందుబాటులో లేక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు, బాలికలు శ్రామికులుగా మారుతున్నారు. ప్రతి రెండు నిముషాలకు స్త్రీలపై హింస కారణంగా, లేదా ప్రసవ సమయంలో ఒక స్త్రీ మరణిస్తోంది. ఐక్యరాజ్యసమితి మహిళలు, బాలికల రక్షణతో పాటు వారిలో సృజనాత్మకతను వెలికితీసే పనిలో నిమగ్నమై ఉంది.
జనాభా సమస్యలో కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, బాల్య వివాహం, మానవ హక్కులు, ఆరోగ్య హక్కు, శిశువు ఆరోగ్యం మొదలైనవి ఉంటాయి. అందువల్ల, ప్రపంచ జనాభా దినోత్సవం వీటిపై దృష్టి పెడుతుంది. ఈరోజు పలు కార్యక్రమాల ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రచిస్తుంది. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులతో చర్చలు నిర్వహించి పలు సవాళ్లను అవకాశాల ద్వారా గుర్తించడానికి ఒక వేదికగా ఈరోజు ఉపయోగపడుతుంది.
ఈ సంవత్సరం 2023 ప్రపంచ జనాభా దినోత్సవ ముఖ్య ఉద్దేశం లింగ సమానత్వంపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారణ కల్పించే దిశగా ఐక్యరాజ్యసమితి పలు సంస్థలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.