Guinness World Records : ఏం ఐడియా రా సామి.. ముక్కులో 68 అగ్గిపుల్లలతో వరల్డ్ రికార్డ్

గిన్నిస్ బుక్‌లో రికార్డు సాధించాలంటే కొత్తగా ఆలోచించాలి.. లేదా పాత రికార్డులు బద్దలు కొట్టాలి. డెన్మార్క్‌కి చెందిన ఓ వ్యక్తి ఎలా రికార్డు సాధించాడో తెలుసా?

Guinness World Records : ఏం ఐడియా రా సామి.. ముక్కులో 68 అగ్గిపుల్లలతో వరల్డ్ రికార్డ్

Guinness World Records

Guinness World Records : కాదేది రికార్డుకి అనర్హం అన్నట్లు డెన్మార్క్‌కి చెందిన ఓ వ్యక్తి ముక్కు రంధ్రాల్లో 68 అగ్గిపుల్లలు నింపి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. వినడానికి కాస్త వింతగా అనిపించినా అతను రికార్డు గెలుచుకున్నది నిజం.

Uttar Pradesh : పొడవైన జుట్టుతో ఉత్తరప్రదేశ్ మహిళ గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించడం కోసం అనేకమంది రకరకాల ఫీట్లు చేస్తుంటారు. మునుపెన్నడూ ఎవరూ చేయని వాటితో పాటు ఆల్రెడీ ఇతరుల పేరుతో ఉన్న రికార్డులు బ్రేక్ చేయాలని నానా తంటాలు పడుతూ ఉంటారు. రికార్డు కోసం వారికి వచ్చే ఆలోచనలు చూస్తే విచిత్రంగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పబోయే రికార్డ్ అలాంటిదే మరి. 39 సంవత్సరాల పీటర్ వాన్ టాంగెన్ బుస్కోవ్ అనే డెన్మార్క్‌కి చెందిన వ్యక్తి ముక్కు రంధ్రాలలో 68 అగ్నిపుల్లలు నింపుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Anchor Suma : యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు.. ఎందుకో తెలుసా..?

ఈ రికార్డు సాధించే క్రమంలో తను ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదని బుస్కోవ్ చెప్పడం విశేషం. విషయం ఏంటంటే అతని ముక్కు రంధ్రాలు పెద్దగా ఉండటం.. సాగే చర్మం కలిగి ఉండటం అతనికి ఈ రికార్డు సాధించడంలో సాయపడ్డాయన్నమాట. ఈ రికార్డుతో సరిపెట్టుకోడట బుస్కోవ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో బుస్కోవ్‌కి జనాలు అభినందనలు చెప్పడంతో పాటు ముక్కుకి నెప్పి కలిగిందా? అంటూ ప్రశ్నలు కురిపించారు.