Worlds Oldest Bodybuilder : ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బాడీబిల్డర్‌ వయసు ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బాడీబిల్డర్‌ వయసు ఎంతో తెలుసా? 90 సంవత్సరాలు. ఇంకా అతను యాక్టివ్‌గానే ఉన్నాడు. పోటీల్లో పాల్గొంటున్నాడు. గెలుస్తున్నాడు. ముత్తాత పేరు మీద ఉన్న రికార్డును కూడా తిరిగ రాశాడు. అతను ఎవరంటే?

Worlds Oldest Bodybuilder : ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బాడీబిల్డర్‌ వయసు ఎంతో తెలుసా?

Worlds Oldest Bodybuilder

Updated On : July 20, 2023 / 7:12 PM IST

Worlds Oldest Bodybuilder : 90 ఏళ్ల వయసులో జిమ్‌కి వెళ్తున్నాడు. ఇప్పటికీ బాడీ బిల్డింగ్ పోటీలలో గెలుస్తాడు. వయసు మీద పడ్డా అద్భుతమైన శరీరాకృతి కలిగి ఉన్న ఆ బాడీ బిల్డర్ గురించి తెలుసుకోవాలని ఉందా?

Elderly man dance viral : ‘కోయీ లడ్కీ హై’ అంటూ వృద్ధుడు చేసే డ్యాన్స్ చూడండి.. మీలో ఉత్సాహం వచ్చేస్తుంది

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బాడీబిల్డర్‌ అమెరికన్ జిమ్ ఆరింగ్టన్. అతని వయసు 90 సంవత్సరాలు. ఇప్పటికీ తన శరీరాకృతిని కాపాడుకుంటూ వస్తున్నాడు. పోటీల్లో పాల్గొంటూ విజేతగా నిలుస్తున్నాడు. జిమ్ ఆరింగ్టన్ పుట్టినప్పుడు 5.5 lb (2.5 kg) బరువుతో నెలలు నిండకుండా పుట్టాడట. జిమ్ తల్లిదండ్రులు అతనిని కాపాడటానికి చాలా కష్టపడ్డారట. 1947 లో అతను 15 సంవత్సరాల వయసు నుంచి బరువులు ఎత్తడం మొదలుపెట్టాడట. తాను సూపర్ హీరో అవ్వాలని అనుకున్నాడట. అక్కడ మొదలైన అతని ఆత్మవిశ్వాసం 90 సంవత్సరాల వయసులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్  టైటిల్ హోల్డర్‌గా ఉండేంతవరకూ కొనసాగింది. ఇప్పటికీ అతను రిటైర్ కావాలని అనుకోవడం లేదట.

Germany : చనిపోయిన భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 83 ఏళ్ల వృద్ధుడు ఏం చేశాడంటే..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం జిమ్ ఆరింగ్టన్ ముత్తాత 2015 లో తన 83 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బాడీబిల్డర్‌గా రికార్డు సాధించారు. ఇప్పుడు ఆ రికార్డును జిమ్ ఆరింగ్టన్ తిరగ రాశాడు. ఆరింగ్టన్ ఇప్పటికీ జిమ్‌కి వెళ్తాడు. బాడీ బిల్డింగ్ పోటీలలో గెలుస్తాడు. ఇటీవల నెవాడాలోని రెనోలో జరిగిన IFBB ప్రొఫెషనల్ లీగ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. పురుషుల 70 ఏళ్లు పైబడిన విభాగంలో మూడవ స్ధానంలో,  80 ఏళ్లు పైబడిన విభాగంలో మొదటి స్ధానంలో నిలిచాడు. జిమ్ ఆరింగ్టన్ రియల్లీ గ్రేట్ బాడీ బిల్డర్.