Helicopter crash In Ukraine: యుక్రెయిన్‌ హెలికాప్టర్ ప్రమాదంలో రష్యా ప్రమేయం ఉందా? జెలెన్ స్కీ వాదన ఏమిటంటే ..

యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో  ప్రసంగించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ప్రమాదంపై ఒక నిమిషం మౌనం పాటించాలని కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యుద్ధం సమయంలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవటం..

Helicopter crash In Ukraine: యుక్రెయిన్‌ హెలికాప్టర్ ప్రమాదంలో రష్యా ప్రమేయం ఉందా? జెలెన్ స్కీ వాదన ఏమిటంటే ..

Helicopter crash In Ukraine

Updated On : January 19, 2023 / 10:22 AM IST

Helicopter crash In Ukraine: యుక్రెయిన్ రాజధాని కీవ్‌ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో యుక్రెయిన్ హోంశాఖ మంత్రి, సహాయ మంత్రితో సహా 18 మంది మరణించారు. ప్రమాదంలో 20కిపైగా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ప్రస్తుతం యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా యుక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుంది. అయితే, యుద్ధం ప్రాంతాలను పరిశీలించేందుకు డెనిస్ మొనస్టిర్ స్కీ తన సిబ్బందితో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ ప్రమాద ఘటనలో రష్యా ప్రమేయం ఉండి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఊహాగానాలకు ఊతమిస్తూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Helicopter crash In Ukraine : కుప్పకూలిన హెలికాప్టర్..యుక్రెయిన్ హోంమంత్రితో సహా 18 మంది మృతి

జెలెన్ స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో  ప్రసంగించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ప్రమాదంపై ఒక నిమిషం మౌనం పాటించాలని కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యుద్ధం సమయంలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవటం, అందులోనూ మంత్రి, సహాయ మంత్రి సహా, అధికారిక బృందం ఉన్న హెలికాప్టర్ కూలడం రష్యా పనేనన్న అనుమానం వ్యక్తం చేశాడు. అయితే, రష్యా యుద్ధమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉందని స్థానిక నివాసి వోలోడిమిర్ ఎర్మెలెంకో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించాడు.

 

హెలికాప్టర్ ప్రమాద సమయంలో పెద్ద పెద్ద భవనాలను ఢీకొట్టకుండా చక్కర్లు కొట్టిందని, పైలెట్ ప్రయత్నాలు విఫలం కావటంతో కిండర్ గార్డెన్ సమీపంలో కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.