Zerodha Nikhil Kamath : స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది : జెరోదా కామత్

జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ‘ఫ్రెండ్ షిప్ మాంద్యం’ గురించి ఆందోళన చెందుతున్నారు. ఏంటీ ఫ్రెండ్షిప్ మాంద్యమా? అంటే..

Zerodha Nikhil Kamath : స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది : జెరోదా కామత్

Zerodha Nikhil Kamath

Updated On : May 30, 2023 / 4:24 PM IST

Zerodha Nikhil Kamath friendship recession :  రాజకీయ సంక్షోభం, ఆహార సంక్షోభం, నీటి సంక్షోభం,ఆర్థిక సంక్షోభం (ఆర్థిక మాంద్యం) అనే మాటలు విన్నాం. దాని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Zerodha co-founder Nikhil Kamath)ఓ కొత్త రకం ‘మాంద్యం’ (recession)గురించి చెప్పుకొచ్చారు. అదే ‘ఫ్రెండ్ షిప్ మాంద్యం’.  ఏంటీ ఫ్రెండ్షిప్ మాంద్యమా? అంటే ఏంటీ అని అనుకుంటున్నారా? నిజమే ఇదేదో కొత్తగా వింటున్న పదం లాగే ఉంది..మరి ఆ ‘ఫ్రెండ్ షిప్ మాంద్యం’(friendship recession)..అంటే ఏంటో ఆయన చెప్పారో తెలుసుకుందాం.

ప్రపంచం స్నేహ మాంద్యాన్ని ఎదుర్కొంటోంది అంటూ ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అన్నారు. దీనికి నేను చాలా ఆందోళన చెందుతున్నాను అని కూడా అన్నారు. చాలా మంది తమకు సన్నిహిత మిత్రులు లేరని వాపోతున్నారని తెలిపారు. తనకు ఐదుగురు మిత్రులు ఉన్నారని వారి కోసం అన్నీ చేస్తానని చెప్పారు.

2021 అమెరికా సర్వేకు సంబంధించిన కొన్ని చిత్రాలను నిఖిల్ కామత్ తన ట్విట్టర్ పేజీలో ఇన్ఫోగ్రాఫిక్స్ ను షేర్ చేశారు. చాలా మందిలో స్నేహ మాంద్యం ఏర్పడుతోందన్న సందేశం వీటిల్లో ఉంది. స్నేహితులు ఎంత మంది అయినా ఉండొచ్చు కానీ కష్ట సుఖాల్లో తోడు నీడగా నేనున్నానని భరోసా ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు. తమ కష్ట, సుఖాల్లో తోడుగా, అండగా ఉండే కనీసం ఓ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఉండాలి కదా.. ఇది లేకపోవడమే స్నేహ మాంద్యం. మనం సంతోషంగా ఉండాలంటే ఒక కమ్యూనిటీ కలిగి ఉండాలనే అంశాన్ని నిఖిల్ కామత్ ప్రస్తావించారు. ‘‘నా జీవితంలో ఐదుగురు సోదరులు ఉన్నారు. వారి కోసం నేను అన్నీ చేస్తాను. జీవితాన్ని మార్చే అంశం ఇది నిజంగా’’ అని కామత్ ట్వీట్ లో పేర్కొన్నారు.

‘Audi Chaiwala’ : ఆడి కారులో వచ్చి వేడి వేడి టీ, కాఫీలు అమ్ముతున్న కుర్రాళ్లు

స్నేహ మాంద్యం అనేది భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారుతుందని అమెరికా సర్వే చెబుతోంది. స్నేహితులు లేక ఒంటరితనం రోజుకు 15 సిగరెట్లు తాగినంత నష్టానికి కారణమవుతుందని..స్నేహ బాంద్యం తీవ్ర సంక్షోభంగా మారుతుందని అమెరికన్ పెర్స్పెక్టివ్ సర్వే హైలైట్ చేసింది. స్నేహితులు లేకుండా పోవడానికి కారణాలను ప్రస్తావిస్తు భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోవటం, పిల్లల పెంపకంపై తల్లిదండ్రుల శ్రద్ధ పెరగడం, పని పని అంటూ జీవితంలో విలువైనవి వదిలేయటం వంటివి బంధాలు విచ్ఛిన్నం కావడానికి కారణమవుతాయని..ఇటువంటివన్నీ ది ఫ్రెండ్ షిప్ పై ప్రభావం చూపిస్తున్నట్టు సర్వే పేర్కొంది.

 

ఈ సర్వే ప్రకారం 15మంది మగవారు తమకు సన్నిహిత మిత్రులు లేరని వెల్లడించింది. 1991లో వారి సంఖ్య 3శాతం మాత్రమే ఉంది. కానీ కోవిడ్ మహమ్మారి సమయంలో సగానికి పైగా మహిళలు తమ స్నేహితులతో సంబంధాలు కోల్పోయారట. ‘స్నేహ మాంద్యం’ అలా పెరుగుతోందని వెల్లడించింది.