2014 నుంచి మొదటిసారి డకౌట్ అయిన బ్యాట్స్ మన్ ఇతడే!

Du Plessis duck out : ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఫా డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో ఓవర్ లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
సందీప్ శర్మ ఓవర్‌లో వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో క్యాచ్ పట్టాడు. ఐపీఎల్ లీగ్ లో డుప్లెసిస్ డకౌట్ కావడం ఇది మూడోసారి. ఐపీఎల్ 2014 తర్వాత ఇదే తొలిసారి కూడా.
ఈ సీజన్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టకున్న చెన్నై బ్యాట్స్ మెన్లలో డుప్లెసిస్ ఒకడు.. SRKతో హోరాహోరీ పోరులో చెన్నై జట్టుకు డుప్లెసెస్ బ్యాటింగ్ ఎంతో కీలకం.
కానీ, ఊహించని రీతిలో డుప్లెసెస్ డకౌట్ రూపంలో పెవిలియన్ చేరడం CSKకు తీరని లోటుగా మారింది. చావా రేవా అనే సమయంలో ధోనీసేనకు ఓపెనర్లతోనే మంచి శుభారంభం దక్కాల్సి ఉంది.
ఇప్పటివరకూ షేన్ వాట్సన్, డుప్లెసెస్ వీరిద్దరే ఓపెనర్లుగా రాణించారు. వీరి భాగస్వామ్యంలో చెన్నై ఖాతాలో పరుగుల వరద పారించారు.. కానీ, దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో డుప్లెసెస్ జోడీగా శామ్ కరన్ వచ్చాడు. షేన్ వాట్సాన్ నెం.3 స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్ దిగాడు. డుప్లెసెస్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరడంతో చెన్నై జట్టులో మిగతా ఆటగాళ్లకు ప్రభావం పడింది.
అయినప్పటికీ చెన్నై ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులతో విజయతీరాలకు చేర్చారు. ఇప్పటివరకూ ఐపీఎల్ 2020లో CSK బెస్ట్ బ్యాట్స్ మెన్ గా డుప్లెసిస్ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ జాబితాలో టాప్ 10 ఆటగాళ్లలో తన టీమ్ నుంచి డుప్లెసెస్ ఒక్కడే ఉన్నాడు. మూడు హాఫ్ సెంచరీలతో పాటు స్ర్టైక్ రేటు 146.88తో 51.16 సగటుతో 307 పరుగులు సాధించాడు.