IPL 2020: జాతి వివక్షపై పాండ్యా కౌంటర్

IPL 2020: జాతి వివక్షపై పాండ్యా కౌంటర్

hardik-pandya

Updated On : October 26, 2020 / 2:49 PM IST

ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడి IPL 2020లో అలవోకగా 45వ మ్యాచ్‌ను గెలిచేసింది. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. హార్దిక్ పాండ్యా మాత్రం మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చాడు. టీ20 ఫ్రాంచైజీ లీగ్ హిస్టరీలో మోకాలిపై నిరసన వ్యక్తం చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. ధాటిగా ఆడిన ఈ ఆల్‌రౌండర్ 21డెలివరీల్లోనే 60పరుగులు చేయగలిగాడు.

2ఫోర్లు, ఏడు సిక్సులతో చెలరేగాడు. 19వ ఓవర్ వరకూ ఆడిన పాండ్యా హాఫ్ సెంచరీని దాటేశాడు. మోకాలిపై నిల్చొని కుడిచేతిని పైకెత్తి వివక్షకు వ్యతిరేకంగా స్టిల్ ఇచ్చాడు. ఈ ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్న పాండ్యాకు #BlackLivesMatter అని పోస్టు పెట్టాడు.



జాతివివక్షకు గురై మే2020లో చనిపోయిన ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌కు భారీ ఎత్తులో సపోర్ట్ లభిస్తుంది. పోలీస్ ఆఫీసర్లు అతనిపై దాడి చేసి మోకాలితో గొంతుపై నొక్కొపెట్టి ఊపిరాడకుండా చేయడం వల్లనే ప్రాణాలు కోల్పోయాడంటూ సోషల్ మీడియా గొంతెత్తి అరిచింది. ఒత్తిడి పెరిగిపోయి శ్వాస ఆడక చనిపోయాడని అప్పటినుంచి క్రీడాకారులంతా.. వివక్షకు వ్యతిరేకంగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు.

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాండ్యా అద్భుతమైన హాఫ్ సెంచరీ, బెన్ స్టోక్స్ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ స్టైల్ మ్యాచ్ కు హైలెట్ గా నిలిచాయి. స్టోక్స్ 60బంతుల్లో 107పరుగులు చేయడంతో రాజస్థాన్ అద్భుతమైన విజయం అందుకుంది.

మ్యాచ్ ఫలితం అటుంచితే.. ముంబై ఇండియన్స్ లీగ్ పట్టికలో ఇప్పటికీ టాప్ లోనే కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో ఉంది.