IPL 2021: పంజాబ్ విజయం పక్కకుబెట్టి ఫ్రెండ్‌షిప్ కనిపించేలా… గేల్ – చాహల్
అలాగే జరిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ శుక్రవారం మ్యాచ్‌లో...

Chris Gayle Chahal
IPL 2021: గతంలో మ్యాచ్ ఫలితం పక్కకుబెట్టి హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ జెర్సీలు మార్చుకుని దిగిన సందర్భం గుర్తుంది కదా. అలాగే జరిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ శుక్రవారం మ్యాచ్‌లో. 34 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ పంజాబ్ ప్లేయర్ గేల్ – ఆర్సీబీ బౌలర్ చాహల్ కలిసి సంబరాలు చేసుకున్నారు.
తొలుత బ్యాటింగ్‌లో రాణించిన పంజాబ్ కింగ్స్.. ఆపై బౌలింగ్‌లో మెరిసి ఆర్సీబీని కట్టడి చేసింది. ఆర్సీబీ కీలక ఆటగాళ్లను తొందరగా పెవిలియన్‌కు పంపడంలో సఫలమైన పంజాబ్ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇది పంజాబ్‌కు మూడో విజయం కాగా, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
If we have to summarize #PBKSvRCB ⤵️#SaddaPunjab #PunjabKings #IPL2021 #PBKSvRCB pic.twitter.com/bplr9spBo9
— Punjab Kings (@PunjabKingsIPL) April 30, 2021
ఆర్సీబీ-పంజాబ్‌ల మ్యాచ్ ముగిసిన తర్వాత క్రిస్ గేల్- చాహల్‌లు తమ శరీరంపై ఉన్న జెర్సీలు విప్పేసి మరీ హంగామా చేశారు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు క్రిస్ గేల్ – ఆర్సీబీ స్పిన్నర్ చాహల్‌లు మంచి స్నేహితులు. తమ జెర్సీలను విప్పేసి మరీ వారి కండలను చూపించారు.
యూనివర్శల్ బాస్ గేల్ తన కండలను బాడీ బిల్డర్‌లాగా చూపిస్తే ఫోజు కొడితే, ఆ పక్కనే ఉన్న చాహల్ మాత్రం తన కండలను చూపించడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ పిక్‌ను పంజాబ్ కింగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.