IPL 2021: ధోనీ డకౌట్, ఢిల్లీ టార్గెట్ 189

భారీ అంచనాలతో బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోనీ.. డకౌట్ గా వెనుదిరిగాడు. అయినప్పటికీ అంతకుముందే అద్భుతమైన ఇన్నింగ్స్..

IPL 2021: ధోనీ డకౌట్, ఢిల్లీ టార్గెట్ 189

Ipl 2021 Dhoni Duckout Delhi Target 189

Updated On : April 12, 2021 / 2:14 PM IST

IPL 2021: భారీ అంచనాలతో బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోనీ.. డకౌట్ గా వెనుదిరిగాడు. అయినప్పటికీ అంతకుముందే అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచిన సురేశ్ రైనా(54) హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేయడంతో జట్టుకు ఊతమొచ్చింది. ఈ క్రమంలో 7వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 189పరుగుల టార్గెట్ నిర్దేశించారు.

బ్యాటింగ్ క్రీజులో మరెవ్వరూ రాణించకపోయినా శామ్ కరన్, రవీంద్ర జడేజా, సురేశ్ రైనాలు స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. కాగా, ఈ ఇన్నింగ్స్ లో ధావన్ ఒక్కడే 3క్యాచ్ లు అందుకుని హైలెట్ గా నిలిచాడు.

చెన్నై సూపర్ కింగ్స్ మూడో వికెట్ పతనం అవడానికి కారణం అయ్యాడు ధావన్. గైక్వాడ్, మొయిన్ అలీతో పాటు అంబటి రాయుడు వికెట్ ను కూడా క్యాచ్ అందుకుని వెనక్కు పంపేశాడు. హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో దూసుకెళ్తున్న రైనాతో పార్టనర్ షిప్ కొనసాగిస్తున్న అంబటి(23; 16బంతులకు) టామ్ కరన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 15 ఓవర్లకు స్కోరు 136/4

ఆరంభ మ్యాచ్ ను ఆచితూచి ఆడుతుంది చెన్నై. ఈ క్రమంలో మొయిన్ అలీ 24 బంతులకు 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పది ఓవర్లకు స్కోరు 71/3గా ఉంది.