IPL 2021 – Pat Cummins: ఇండియాను ఆదుకునేందుకు పాట్ కమిన్స్ పెద్ద మనసు

కరోనా ఉగ్రరూపంతో అల్లాడిపోతున్న భారత్‌ను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ...

IPL 2021 – Pat Cummins: ఇండియాను ఆదుకునేందుకు పాట్ కమిన్స్ పెద్ద మనసు

Ipl 2021 Pat Cummins Donates To Pm Cares Fund

Updated On : April 26, 2021 / 6:46 PM IST

IPL 2021 – Pat Cummins: కరోనా ఉగ్రరూపంతో అల్లాడిపోతున్న భారత్‌ను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ముందుకొచ్చారు. తమవంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు సాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా మిగతా ఐపీఎల్‌ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో ఆక్సిజన్‌ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో పాట్‌ ఇలా చేయాలనుకున్నారట.

చిరుసాయమే అయినా బాధితులకు ఎంతోకొంత ఉపయోపడితే చాలని అంటున్నారు పాట్ కమిన్స్. ప్రత్యేకించి ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేసే క్రమంలో ఈ విరాళాన్ని ఉపయోగించాలని కోరారు. దేశంలో కరోనా కేసుల తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐపీఎల్‌ కొనసాగించడం సరైనదా కాదా అనే చర్చ జరుగుతోంది.

లాక్‌డౌన్‌లో కాలక్షేపం చేస్తున్న ప్రజలకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు కాస్త ఉపశమనం ఇస్తాయని అన్నారు. రికార్డు కేసులతో బెంబేలెత్తుతున్న వారికి క్రికెట్‌ ఊరటనిస్తుందనే విషయాన్ని భారత ప్రభుత్వానికి తాను సూచించదలచుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు కమిన్స్‌ ప్రకటన విడుదల చేశాడు.

2021 ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో పాట్‌ కమిన్స్‌ సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కేవ‌లం 34 బంతుల్లోనే క‌మిన్స్ 66 ప‌రుగులు చేసి కొత్త చరితను రాశాడు. ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్లో 30, అంత‌కంటే ఎక్కువ ప‌రుగులు చేసిన వారిలో క‌మిన్స్ ఆరోవ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే.