IPL 2021 – Ben Stokes: బెన్‌స్టోక్స్ మొత్తం టోర్నమెంట్ నుంచే అవుట్
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మొత్తం టోర్నమెంట్ నుంచే దూరం కానున్నాడు. చేతి వేలికి గాయమై విరిగిపోవడంతో దూరం కావాల్సి..

Ben Stokes
IPL 2021 – Ben Stokes: ఓటమి పరాభవంతో కుమిలిపోతున్న రాజస్థాన్ కు మరో షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మొత్తం టోర్నమెంట్ నుంచే దూరం కానున్నాడు. చేతి వేలికి గాయమై విరిగిపోవడంతో దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీం మేనేజ్మెంట్ చెప్పింది.
2021 ఏప్రిల్ 12న జరిగిన పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా ఎడమచేతికి గాయమైంది. వైద్య పరీక్షలు జరిపి వేలు విరిగినట్లు కన్ఫామ్ చేయడంతో దురదృష్టవశాత్తు టోర్నమెంట్ కు దూరం కాబోతున్నాడని రాజస్థాన్ రాయల్స్ అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది.
ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జట్టుతోనే ఉండి అతని స్థానంలో వేరే వ్యక్తి వచ్చే వరకూ కంటిన్యూ అవుతానని చెప్తున్నాడు. బెన్ జట్టుతో పాటే ఉండి మైదానంలో మాకు సపోర్ట్ ఇస్తాడని ఆశిస్తున్నాం. అతని స్థానంలో సీజన్ కు వేరొకరిని తీసుకోవాలనుకుంటున్నామని అధికారిక స్టేట్మెంట్ చెప్పింది.
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో స్టోక్స్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ వేశాడు. క్రిస్ గేల్ క్యాచ్ అందుకున్న సమయంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించింది.