MS Dhoni Parents: కొవిడ్ పాజిటివ్‌తో హాస్పిటల్ లో చేరిన ధోనీ పేరెంట్స్

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పేరెంట్స్ బుధవారం రాంచీలోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు..

MS Dhoni Parents: కొవిడ్ పాజిటివ్‌తో హాస్పిటల్ లో చేరిన ధోనీ పేరెంట్స్

Ms Dhonis Parents Admitted To Hospital After Testing Positive For Covid 19

Updated On : April 21, 2021 / 12:19 PM IST

MS Dhoni parents: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరెంట్స్ దేవికా దేవీ, పాన్ సింగ్ కొవిడ్ పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో చేరారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పేరెంట్స్ బుధవారం రాంచీలోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం. పల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వారిద్దరికీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

అదృష్టవశాత్తు ఇద్దరికీ ఆక్సిజన్ లెవల్స్ స్థిరంగానే ఉన్నాయి. ధోనీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2021లో ఆడుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ లో 200వ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2020 తర్వాత ఫ్యామిలీతోనే గడిపిన ధోనీ ఇటీవలే టోర్నమెంట్ కు రెడీ అయ్యాడు.

ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో మూడు మ్యాచ్ లు ఆడి నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గతేడాది ధోనీ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ప్లే ఆఫ్స్ కు కూడా క్వాలిఫై కాలేకపోయింది సీఎస్కే. సీజన్ మొత్తంలో ధోనీ బ్యాటింగ్ లో సత్తా కనబరచలేకపోయాడు. 14మ్యాచ్ లలో అతను చేసింది కేవలం 200పరుగులు మాత్రమే.