జులై వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 10:11 AM IST
జులై వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

Updated On : April 29, 2020 / 10:11 AM IST

కరోనా వచ్చింది…లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్‌ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఎలాగో ఇంటిదగ్గర నుంచి పనిచేయడం అలవాటైంది కదా. ఇదే కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఇది వీళ్ల ఆలోచన.  ప్రభుత్వం కూడా ఇదే బెటరేనని అనుకొంటోంది.

 Gurgoanలోని MNC, BPO, IT ఉద్యోగులు జులై వరకు ఇంటి నుంచి పని చేయాల్సిన అవసరం ఉందని Gurgaon Metropolitan Development Authority, CEO విఎస్ కుండూ అంటున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో భాగమైన Gurgaonను మిలీనియం సిటీ‌గా పిలుస్తారు. infosys, genpact, google, microsoft వంటి టెక్నాలజీ కంపెనీలకు ఇది కేంద్రం. 

 

ఇక్కడి ఐటీ ఉద్యోగులంతా జులై చివరివరకు ఇంటి నుంచే పని చేసేలా కంపెనీలు వెసులుబాటునివ్వాలని కోరారు. దేశంలో అన్నిచోట్ల లాక్‌డౌన్‌తో ఉద్యోగులందరూ work from home చేస్తున్నారు. ఇక మే 3 తర్వాత విమాన ప్రయాణాలకు అనుమతినివ్వాలా వద్దా అని  ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరో మూడునెలలు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేస్తే, ఈలోగా కరోనా కంట్రోల్ అవుతుంది. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తే అవకాశాలున్నాయని కంపెనీలకు సూచిస్తున్నారు కుండు. 

జిల్లాలో రేషన్ కార్డులులేని పేద కుటుంబాలకు ఆహార రూపంలో అందించడం ప్రారంభించారు. మూడు నెలల పాటు వర్తిస్తుంది అని కుండు తెలిపారు. హర్యానాకు అదనపు ముఖ్యకార్యదర్శి అయిన కుండు, DLFతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించొచ్చు. కాకపోతే సోషల్‌ డిస్టెన్సె మాత్రం తప్పని సరి అన్నారు.