Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు..అభిషేక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు డిసెంబర్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ లో ఉన్న సమయంలో అభిషేక్ కు అసవరమైన పుస్తకాలు,దుస్తులు, మందులు అందించాలని సూచించింది. ఈ సందర్భంగా ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్ ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని కాబట్టి ఆయన్ని ఐదు రోజులు తమ కష్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు..అభిషేక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Judicial remand for Abhishek Boyinapalli in Delhi Liquor Scam

Updated On : November 24, 2022 / 4:21 PM IST

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు డిసెంబర్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ లో ఉన్న సమయంలో అభిషేక్ కు అసవరమైన పుస్తకాలు,దుస్తులు, మందులు అందించాలని సూచించింది. ఈ సందర్భంగా ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్ ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని కాబట్టి ఆయన్ని ఐదు రోజులు తమ కష్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.

విజయ్ నాయర్ కు సంబంధించిన ల్యాప్ టాప్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని ల్యాబ్ నుంచి ల్యాప్ టాప్ రిపోర్టు రేపు వస్తుందని ఈడీ వెల్లడించింది. ఈకేసులో ల్యాబ్ టాప్ లో ఉన్న వివరాలు కేసుకు కీలకంగా ఉంటాయని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రూ.100కోట్లు చేతులుమారాయని ఈడీ వెల్లడించింది.

కాగా..అభిషేక్ కి ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు అతడిని గురువారం (నవంబర్24,2022) కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్నందున రెం14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. మరో నిందితుడు విజయ్ నాయర్ ను మరో ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది.

ఇకపోతే..ఈ కేసులో ఇతర నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు జైలులో ఇంటి నుంచి తెచ్చే ఆహారం అందించేందుకు నిరాకరించింది. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనం అనుమతించడం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏదైనా కావాలనుకుంటే జైలు అధికారులకు చెప్పి చేయించుకోవాలని సూచించారు.