KGF2: కేజీఎఫ్ 2 ఎడిటర్ ఎవరో తెలిస్తే అవాక్కవడం ఖాయం!
ప్రస్తుతం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కేజీఎఫ్ 2 అనే చెప్పాలి. గతంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ విజయాన్ని.....

19 Year Old Boy Ujwal Kulkarni Turns Kgf2 Editor
KGF2: ప్రస్తుతం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కేజీఎఫ్ 2 అనే చెప్పాలి. గతంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా, దీనికి అన్ని భాషల్లోనూ ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో చిత్ర యూనిట్ రూపొందించింది.
KGF2: పుష్పతో పెట్టుకుంటారా.. అంటూ యశ్ పరువు తీసిన తెలుగు మీడియా!
కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఎట్టకేలకు ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను దేశవ్యప్తంగా నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతేగాక ఈ వార్త గురించి తెలుసుకున్న వారు అవాక్కవుతున్నారు.
కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ మూవీని చిత్ర యూనిట్ తెరకెక్కించడంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ సినిమా కోసం పనిచేసిన వారిలో చాలా మంది ఫేం ఉన్నవారే కావడం విశేషం. కానీ ఈ సినిమా ఎడిటర్ గురించి మీకు తెలుసా? కేజీఎఫ్ 2 సినిమాకు ఎడిటర్‌గా పనిచేసింది ఓ 19 ఏళ్ల కుర్రాడు. అవును.. మీరు చదివింది నిజమే.. ఉజ్వల్ కుల్కర్ణి అనే ఈ కుర్రాడు షార్ట్ ఫిలింస్, ఫ్యాన్ ఎడిట్స్ వంటివి చేస్తూ ఉండేవాడు. అయితే కేజీఎఫ్ తొలి భాగానికి అతడు చేసిన కొన్ని ఫ్యాన్ ఎడిట్స్ ప్రశాంత్ నీల్‌కు బాగా నచ్చడంతో అతడిని కేజీఎఫ్ 2 సినిమాకు సోలో ఎడిటర్‌గా తీసుకున్నాడు.
KGF2: భారీ ఓపెనింగ్స్‌పై కన్నేసిన కేజిఎఫ్2.. బాక్స్ బద్ధలేనా?
దీంతో ఇప్పుడు అతడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయంటే అది ఖచ్చితంగా ఉజ్వల్ పనితనానికి నిదర్శనం అని చెప్పాలి. ఈ 19 ఏళ్ల ఉజ్వల్ కుల్కర్ణి మున్ముందు మరింత ఎత్తుకు ఎదగాలని ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు, నెటిజన్లు అతడికి విషెస్ చెబుతున్నారు.