Boat Accident in Yamuna river : యమునా నదిలో పడవ ప్రమాదం..20 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని యమునానదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు.

Boat Accident in Yamuna river : యమునా నదిలో పడవ ప్రమాదం..20 మంది మృతి

20 dead after boat accident in Yamuna river

Updated On : August 11, 2022 / 5:26 PM IST

20 dead after boat accident in Yamuna river : ఉత్తరప్రదేశ్‌లోని యమునానదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికిపైగా గల్లంతయ్యారు. వీరిలో 20మంది మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50మంది ప్రయాణీకులు ఉన్నారు. బందాలోని మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళ్తున్న బోటు అదుపు తప్పి బోల్తాపడింది. గల్లైంతన వారిలో 20 నుంచి 25 మంది వరకు చిన్నారులు, మహిళలు ఉన్నట్లుగా సమాచారం. గల్లైంతన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. పడవలో ఉన్నవాంతా నీటిలో మునిగిపోయారు. కొందరు ఈత వచ్చినవారు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.