Saranga Dariya : సోషల్ మీడియాలో ‘సారంగదరియా’ నయా రికార్డ్..!
అతి తక్కువ టైం లో 200 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఫాస్టెస్ట్ లిరికల్ సాంగ్‌గా ‘సారంగ దరియా’ నిలిచింది..

Saranga Dariya
Saranga Dariya: ‘రౌడీ బేబీ’ అంటూ కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో కలిసి రచ్చ చేసిన టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి ‘సారంగదరియా’ అంటూ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. యూట్యూబ్‌లో ఈ పాట హవా ఇంకా కొనసాగుతూనే ఉంది..
‘దాని కుడి భుజం మీద కడవా.. దాని గుత్తపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా చెలియా.. దాని పేరే ‘‘సారంగ దరియా’’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది.. చాలా మంది తమ మొబైల్ కాలర్ ట్యూన్‌గా ‘సారంగదరియా’ పాటే పెట్టుకున్నారంటే ఏ రేంజ్లో నచ్చేసిందో చూసుకోండి మరి..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి.. ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన ‘లవ్ స్టోరి’ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది..
తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ చేసిన తక్కు వ సమయంలోనే 1 మిలియన్‌కి పైగా లైక్స్, 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పాత రికార్డులను బీట్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది.. టాలీవుడ్లో అతి తక్కువ టైం లో 200 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఫాస్టెస్ట్ లిరికల్ సాంగ్‌గా ‘సారంగ దరియా’ నిలిచింది..