Air Balloon Crashes: హాట్​ఎయిర్ బెలూన్ ప్రమాదం.. ఐదుగురు మృతి!

అమెరికాలోని హాట్​ఎయిర్​ బెలున్​ ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలట్​ సహా మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Air Balloon Crashes: హాట్​ఎయిర్ బెలూన్ ప్రమాదం.. ఐదుగురు మృతి!

Air Balloon Crashes (1)

Updated On : June 27, 2021 / 12:04 PM IST

Air Balloon Crashes: అమెరికాలోని హాట్​ఎయిర్​ బెలున్​ ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలట్​ సహా మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. న్యూ మెక్సికో నగరంలో హాట్​ఎయిర్​ బెలూన్​ విద్యుత్​ తీగలకు తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. హాట్​ఎయిర్​ బెలున్​ అదుపుతప్పి ఒక్కసారిగా అక్కడున్న విద్యుత్​ తీగలవైపు దూసుకెళ్లి​ విద్యుత్​ తీగలకు తాకడంతో మంటలు చెలరేగాయి. బెలూన్ మంటలలో చిక్కుకోవడంతో 100 అడుగల ఎత్తులో నుంచి ముందు బెలూన్​కు ఉన్న గోండోలా నేలకొరిగింది. ప్రమాదం జరిగిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అయితే.. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. హాట్​ఎయిర్​ బెలూన్​ను నావిగేట్​ చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని.. కానీ కొన్నిసార్లు దురదృష్టవ శాత్తు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని ఎయిర్​ బెలూన్​ ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు.