బాలీవుడ్: నాలుగు మరణాలు.. నసీరుద్దీన్ షా అనారోగ్యం.. స్పందించిన సీనియర్ నటుడు
తన ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలపై స్పందించిన నసీరుద్దీన్ షా..

తన ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలపై స్పందించిన నసీరుద్దీన్ షా..
బాలీవుడ్ పరిశ్రమలో రెండు రోజుల్లో మూడు మరణాలు సంభవించడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ వంటి లెజెండరీ యాక్టర్స్ 24 గంటల వ్యవధిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఇర్ఫాన్ చనిపోయిన రోజు (ఏప్రిల్ 29, బుధవారం రాత్రి) పాపులర్ యంగ్ సింగర్, నటుడు అర్జున్ కనుంగో తండ్రి కూడా మరణించిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా CEO కుల్మీత్ మక్కర్ (60)గుండెపోటుతో కన్నుమూశారు. వరుస మరణాలతో చిత్రసీమ దిగ్భ్రాంతికి లోనైంది.
ఇదిలా ఉండగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యంతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని నసీరుద్దీన్ షా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ‘‘నాన్నగారికి ఏం కాలేదు. ఆయన బాగానే ఉన్నారు’’ అంటూ షా కుమారుడు వివాన్ షా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘నా ఆరోగ్య సమాచారం గురించి ఆందోళన చెందుతూ, నన్ను సంప్రదిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. పుకార్లను నమ్మొద్దు’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు నసీరుద్దీన్ షా.
Also Read | మూడు రోజుల్లో నాలుగు మరణాలు.. షాక్‌లో బాలీవుడ్..