Manish Sisodia: పీపీఈ కిట్ల స్కాంలో అసోం సీఎం.. బీజేపీపై ఆప్ ఆరోపణలు

బీజేపీ నేత స్కాంను బయటపెడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినట్లుగానే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. అసోం సీఎంపై ఆరోపణలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ పీపీఈ కిట్ల స్కాంకు పాల్పడ్డారని మనీష్ ఆరోపించారు.

Manish Sisodia: పీపీఈ కిట్ల స్కాంలో అసోం సీఎం.. బీజేపీపై ఆప్ ఆరోపణలు

CBI Raids

Updated On : June 4, 2022 / 8:21 PM IST

Manish Sisodia: బీజేపీ నేత స్కాంను బయటపెడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినట్లుగానే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. అసోం సీఎంపై ఆరోపణలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ పీపీఈ కిట్ల స్కాంకు పాల్పడ్డారని మనీష్ ఆరోపించారు. అసోం సీఎం బీజేపీ తరఫున ఎన్నికైన సంగతి తెలిసిందే.

Janasena: కోనసీమలో చిచ్చుపెట్టింది ప్రభుత్వమే: నాదెండ్ల మనోహర్

‘‘2020లో అసోంలో హిమంత విశ్వ శర్మ ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన పీపీఈ కిట్ల స్కాం చేశారు. తన భార్య రిణికి భుయాన్ శర్మకు చెందిన కంపెనీకి పీపీఈ కిట్ల సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. రూ.990కి ఒక పీపీఈ కిట్ చొప్పున కంపెనీకి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. అప్పుడు మార్కెట్లో వేరే సంస్థలు రూ.600కే పీపీఈ కిట్లు అందజేస్తున్నాయి. ఎక్కువ ధరకు కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ ఆ సంస్థ పీపీఈ కిట్లు సరఫరా చేయలేదు. ఆ తర్వాతి కాంట్రాక్టును మళ్లీ రూ.1680కి పెంచారు. దీనిపై విచారణ జరిపే దమ్ము బీజేపీకి ఉందా? ఈ అవినీతిపై బీజేపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది’’ అని మనీస్ సిసోడియా ప్రశ్నించారు.

Boiler Blast: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. తొమ్మిది మంది మృతి

ఇటీవల ఢిల్లీలోని ఆప్‌కు చెందిన మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నేతపై చర్యలు తీసుకున్నందుకు ప్రతిగా, ఆప్ తరఫున తాజాగా బీజేపీపై ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలపై హిమంత విశ్వ శర్మ స్పందించారు. ఆప్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు పరువునష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.