Boiler Blast: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. తొమ్మిది మంది మృతి

ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో తొమ్మిది మంది కూలీలు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Boiler Blast: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. తొమ్మిది మంది మృతి

Boiler Blast

Boiler Blast: ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో తొమ్మిది మంది కూలీలు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుడు ప్రభావంతో దగ్గర్లోని ఫ్యాక్టరీల పై కప్పులు కూడా దెబ్బతిన్నాయంటే పేలుడు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన ప్రదేశం ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Janasena: కోనసీమలో చిచ్చుపెట్టింది ప్రభుత్వమే: నాదెండ్ల మనోహర్

మంటలు ఆర్పేందుకు దాదాపు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. గాయాలపాలైన బాధితులను అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేశామని, దీనికి బాధ్యులైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.